తెలంగాణ సీఎం కేసీఆర్‌....‘ఫిదా’! | CM Kcr watched Fida telugu movie | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు సీఎం కేసీఆర్‌....‘ఫిదా’!

Published Tue, Jul 25 2017 9:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌....‘ఫిదా’! - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌....‘ఫిదా’!

హైదరాబాద్‌: ‘ఫిదా’ సినిమాలో నటీనటులు చక్కగా నటించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) కితాబిచ్చారు. వీలు చూసుకుని తనను కలవాలని దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నిర్మాత్‌ దిల్‌రాజును ఆయన ఆహ్వానించారు. ‘ఫిదా’ సినిమాను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సినిమాను అద్భుతంగా తీశారని చిత్రయూనిట్‌ను కేసీఆర్‌ మెచ్చుకున్నారు.

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్‌ సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ‘ఫిదా’ అవుతున్నారు. సున్నిత భావోద్వేగాలను తెరపై అందంగా చూపించడంలో చేయి తిరిగిన శేఖర్‌ కమ్ముల మరోసారి తన ప్రత్యేకత చాటుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement