వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో | Harshavardhan Rane Cameo in Varun tej Fida | Sakshi
Sakshi News home page

వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో

Published Thu, Apr 27 2017 10:03 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో

వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. శేఖర్ మార్క్ క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఫిదాలో వరుణ్ తేజ్తో పాటు మరో యంగ్ హీరో నటించనున్నాడు.

శేఖర్ కమ్ముల గత చిత్రం అనామికలో లీడ్ రోల్లో నటించిన యంగ్ హీరో హర్షవర్ధన్ రానే ఫిదాలో కీలకమైన అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హర్ష, శేఖర్ కమ్ముల మీద ఉన్న గౌరవంతో వెంటనే తన బాలీవుడ్ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ శేఖర్ కమ్ములకు టైం ఇచ్చాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హర్షవర్ణ్ రానే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement