Harshavardhan Rane
-
పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?
Harshvardhan Sanjeeda Dating: సాధారణంగా టాలీవుడ్లో హీరోయిన్లకు అవకాశాలు తక్కువని అంటారు. చాలావరకు అది నిజమేనని అనుకుంటారు. కానీ ఓ తెలుగు నటుడికి కూడా ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయాడు. అక్కడే హీరోగానూ నటిస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పుడు అతడు ఏకంగా ఓ పెళ్లయిన నటితో కలిసి డేటింగ్ చేస్తున్నాడు. కొన్ని ఫొటోలు వైరల్ అయ్యేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' vs 'జవాన్'.. ఇదెక్కడి గొడవరా బాబు!?) రాజమండ్రి కుర్రాడు హర్షవర్ధన్ రానే.. తెలుగులో అవును, ఫిదా, గీతాంజలి, బెంగాల్ టైగర్ తదితర సినిమాల్లో నటించాడు. కానీ మన డైరెక్టర్స్ ఎవరూ ఇతడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బాలీవుడ్లో ట్రై చేశాడు. అక్కడ క్లిక్ అయిపోయాడు. దీంతో హిందీలో వరసగా సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఇతడు.. లేడీ యాక్టర్స్ కిమ్ శర్మ, మీనాక్షి దాస్ తో డేటింగ్ చేశాడు. వాళ్లతో ఎందుకో ఇతడికి సెట్ కాలేదు. దీంతో విడిపోయారు. ఇప్పుడు మాత్రం హిందీ నటి సంజీదా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి తాజాగా టూర్‌కి వెళ్లారు. సంజీదాకు ఇప్పటికే పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. నటుడు ఆమిర్ అలీని 2012లో వివాహం చేసుకున్న ఈమె.. గతేడాది విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు హర్షవర్ధన్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీడియా ప్రతినిధులు హర్షని దీని గురించి అడిగితే.. ఎటు తేల్చకుండా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో డేటింగ్ నిజమేనని తేలింది. (ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) -
స్కూల్ ఫేర్వెల్ ఈవెంట్లో నటుడు హర్షవర్ధన్ రాణే సందడి (ఫోటోలు)
-
ఇష్టమైన బైక్‌ను అమ్మకానికి పెట్టిన 'ఫిదా' నటుడు
ఆక్సిజన్ అందక నరకయాతన అనుభవిస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎంతమందో.. అలాంటి వారికి తనవంతు సాయం చేయాలని ముందుకొచ్చాడు ఓ నటుడు. ఇందుకోసం ఏకంగా తన బైక్‌ను అమ్మకానికి పెట్టడం గమనార్హం. తన బైక్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఇవ్వండని, అవసరమైన పేషెంట్లకు దాన్ని అందిస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకునే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను తనే స్వయంగా శుభ్రం చేస్తున్న ఫొటోలతో పాటు దానిపై చక్కర్లు కొట్టిన ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఈ నటుడు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా అతడు గతేడాది అక్టోబర్‌లో కరోనా బారిన పడి అనంతరం ఆ మహమ్మారిని జయించాడు. ఇదిలా వుంటే వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్ తేరీ కసమ్ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో రిలీజైన తైష్ సినిమాలోనూ కనిపించాడు. View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) చదవండి: విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి అక్కడ బోల్తా పడినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ -
ఇది నా కెరీర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్ : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మిగతా చోట్ల విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజునే ఎన్నో వాయిదాల తర్వాత తాను తీసిన ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సరిగ్గా అదే రోజు విడుదలవ్వడం అంతా యాదృచ్చికమే అయినా నమ్మలేకపోతున్నానని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. దేవుళ్ల దీవెనలు తమకే ఉన్నాయని పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్‌లో తెలుగు దేశం ఆవిర్భావం తేదీని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1989లో అక్కినేని శివ, 2019లో నందమూరి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రామ్‌గోపాల్ వర్మ గారు వొళ్లు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా అని ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు బీవీఎస్ రవి చేసిన ట్వీట్‌కు సర్, ఏదో పొరపాటు జరిగిపోయింది, మన్నించండి అంటూ వర్మ సరదాగా బదులిచ్చారు. ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు మీరే అనుకుంటున్నా అని హీరో హర్ష వర్ధన్ చేసిన ట్వీట్ తన కెరీర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్‌గా వర్మ పేర్కొన్నారు. This is the best compliment I got in my entire career 🙏 “ Sir just saw #LakshmIsNTR and I think YOU ARE THE ONLY TRUE SON OF NTR “ —Harshavardhan (actor) — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 సర్, .ఏదో పొరపాటు జరిగిపోయింది. మన్నించండి.🙏🙏🙏 https://t.co/vUD3ohyjnY — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 రామ్ గోపాల్ వర్మ 1989 - అక్కినేని "శివ" 2019 - నందమూరి "లక్ష్మీస్ ఎన్టీఆర్" — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 In an unbelievable coincidence #LakshmisNTR after all its postponements releases on the same day as Telugu Desam was founded .Gods are really blessing us 🙏🙏🙏 pic.twitter.com/seWh8VN0Ns — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాకేష్‌రెడ్డికి సూచించింది. చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ -
వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. శేఖర్ మార్క్ క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఫిదాలో వరుణ్ తేజ్‌తో పాటు మరో యంగ్ హీరో నటించనున్నాడు. శేఖర్ కమ్ముల గత చిత్రం అనామికలో లీడ్ రోల్లో నటించిన యంగ్ హీరో హర్షవర్ధన్ రానే ఫిదాలో కీలకమైన అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హర్ష, శేఖర్ కమ్ముల మీద ఉన్న గౌరవంతో వెంటనే తన బాలీవుడ్ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ శేఖర్ కమ్ములకు టైం ఇచ్చాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హర్షవర్ణ్ రానే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. -
మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ఘర్షణ. తమిళ్లో అగ్ని నచ్చతిరం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. డబ్బింగ్ వర్షన్ గా తెలుగులో రిలీజ్ అయి ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అంతేకాదు 200 రోజులు పాటు ఆడిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. అదే సినిమాను వన్ష్ పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. విక్కీ కౌశల్, హర్షవర్థణ్ రాణేలు హీరోలుగా బెజాయ్ నంభియార్ దర్శకత్వంలో ఘర్షణ సినిమా మరోసారి రీమేక్ అవుతోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వాజీర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న బెజాయ్, ఘర్షణ రీమేక్ తో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. పాతికేళ్ల క్రితం సంచలనాలు సృష్టించిన ఘర్షణ ఈ తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుదో చూడాలి. -
షర్ట్ ఆఫ్...
టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె... తన యాన్యువల్ ఈవెంట్ ‘షర్ట్ ఆఫ్’ను వినూత్నంగా నిర్వహించాడు. మాదాపూర్‌లోని తన సన్నిహితుని జిమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తను నటించిన సినిమాల్లో ధరించిన దుస్తులను విక్రయించారు. దీని ద్వారా సేకరించిన లక్షా పది వేల రూపాయల నిధులను దత్తత తీసుకున్న పాప స్వాతి చదువుకు, మరికొందరు అనాథ పిల్లల శ్రేయస్సుకు వినియోగిస్తానని ఈ సందర్భంగా హర్ష చెప్పాడు. -
ఫిట్ టుగేదర్.. ఫిట్ అండ్ ఫన్
వీకెండ్ పార్టీలను మాత్రమే కాదు. వర్కవుట్‌ని కూడా షేర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ కపుల్. హార్ట్ బీట్ లాంటి అమ్మాయో, అబ్బాయినో పార్ట్నర్గా మార్చుకుని 1, 2, 3 అని కౌంట్ చేస్తూ కసరత్తులు చేసేస్తుంటే... ‘జిమ్’దగీ కే లియే... బస్ ఏక్ సనమ్ చాహియే ఆషికీ కేలియే’పాట విన్నంత హ్యాపీ. ఆ హ్యాపీనెస్లో వర్కవుట్స్ అలసట అంతా దూ.పి... అదేనండీ దూది పింజే... పైగా బోలెడంత ఫన్ కూడాను. ప్రత్యేకంగా సిటీప్లస్ కోసం ‘మాయ’ సినిమా జంట హర్షవర్ధన్ రాణే, అవంతికలు వర్కవుట్కు ఫన్ మిక్స్ చేసి చేసిన ఫిట్ అండ్ ఫన్ ఫీట్లివి. బెంచ్‌ప్రెస్ చేసేటప్పుడు బార్బెల్కి వెయిట్ వేసుకుని చేస్తారు. అయితే ఇక్కడ నేలనే బెంచ్ చేసుకుని అమ్మాయినే వెయిట్‌గా మార్చుకున్నాడీ అబ్బాయి. లైట్‌వెయిట్ డంబెల్‌ను అమ్మాయి, సరిపడా వెయిట్ డంబెల్‌ను అబ్బాయి అందుకున్నారు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మిర్రర్లో తమ బ్యూటీఫుల్ ఫిజిక్‌లను చూసుకుంటూ చేస్తే ఎన్ని లిఫ్టేషన్స్ చేసినా అలసట రాదని చెబుతున్నారీ జంట. ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్. ఏ పనికైనా. అందులో గాల్ఫ్రెండే ట్రైనర్ పోస్ట్‌లోకి వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే అబ్బాయి ఆగుతాడా? బైసప్ని షేపప్ చేసేయ్యడూ... స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కలసి చేసే ప్రయత్నంలో చేతిలో స్విస్బాల్ను కూడా పట్టుకుని బాడీని విభిన్న రకాలుగా స్ట్రెచ్ చేస్తున్నారీ బ్యూటీఫుల్ కపుల్. వర్కవుట్స్ చేసిన తర్వాత ఎనర్జిటిక్‌గా. కొండల్ని పిండిచేసేంత శక్తి వచ్చినట్టుంటుంది. ఆ సమయంలో కిక్ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్‌ను ట్రై చేస్తే.. ఫన్‌కి ఫన్, ఫిట్నెస్కి ఫిట్నెస్. వర్కవుట్స్ అన్నీ అయిపోయాక ఇద్దరూ ఒకేసారి బాడీని స్ట్రెచ్ చేయడానికి ఇదేదో మంచి ఐడియా అనిపిస్తుంది కదూ... (వీటిలో కొన్ని ఫీట్లు కసరత్తుల్లో కాకలు తీరినవారు మాత్రమే చేసేవి. జస్ట్... సరదా కోసం, కపుల్ కంబైన్డ్‌గా చేస్తే కలిగే హ్యాపీనెస్‌ను తెలిపేందుకు మాత్రమే ఇవి తప్ప ట్రై చేయమని చెప్పడానికి కాదు.) జిమ్ కర్టెసీ: హెలియోస్, జూబ్లీహిల్స్ - ఎస్.సత్యబాబు -
సినిమా రివ్యూ: కొద్దిసేపే ‘మాయ’
విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి. కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి. ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి. సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది. కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది. తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ బలాలు: విలక్షణమైన కథాంశం. సౌండ్ ఎఫెక్ట్లు తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం బలహీనతలు: అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం అందరూ కొత్త ముఖాలే కావడం ఆకట్టుకోని హీరోయిన్ నటన ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం. - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: మాయ
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి నిర్మాత: మధుర శ్రీధర్ దర్శకుడు: నీలకంఠ ప్లస్ పాయింట్స్: కథనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే వేగం లేకపోవడం, వినోదం లేకపోవడం షో చిత్రంతో జాతీయ అవార్డు, మిస్సమ్మ చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నీలకంఠ తాజాగా హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్ లతో 'మాయ'చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, థ్రిలర్ రూపొందిన ఈ చిత్రం మాయ చేసిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఓ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా(సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్లి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'. మేఘన పాత్రలో అవంతిక మిశ్రాకు ఈ చిత్రంలో కీలకపాత్ర లభించింది. గ్లామరస్ గా కనిపించింది. కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను పర్వాలేదనిపించే స్థాయిలో పోషించింది. ఫ్యాషన్ డిజైనర్ పాత్రను పోషించిన హర్షవర్ధన్ రాణేకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కించుకున్నారు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో తడబాటుకు గురైనాడు. కాని మిగితా చిత్రాలతో పొల్చుకుంటే హర్షకు ఇంపార్టెంట్ పాత్రనే ఈ చిత్రంలో లభించింది. యాక్టింగ్, హావభావాలు పలికించడంలోను మరికొంత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రంలో పూజా పాత్రలో సుష్మా రాజ్ కనిపించింది. చిత్రంలో మరో కీలక పాత్రలో సుష్మా తన మార్కును ప్రదర్శించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంది. సిద్దూకి ప్రియురాళిగా నటించిన నందిని రాయ్ ది అంతగా ప్రాధాన్యత లేని పాత్రే. నాగబాబు, ఝాన్సీ అతిధి పాత్రలకే పరిమితమయ్యారు. టెక్నికల్: ఓ హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి శేఖర్ చంద్ర ఆకట్టుకున్నారు. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. బాల్ రెడ్డి ఫోటోగ్రఫి క్వాలిటీ పరంగా బాగుంది. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎప్పుడూ విభిన్న కథాంశంతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు నీలకంఠ తాజాగా మరో ప్రయోగం మాయతో ముందుకొచ్చారు. తొలి సీన్ లోనే థ్రిల్ కలిగించి నీలకంఠ ఆకట్టుకున్నారు. ఆతర్వాత కథ నత్తనడక సాగడంతో తొలి భాగం కొంత విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక రెండవ భాగంలో హీరోపై అనుమానాలు రేకెత్తించి కొంత ఆసక్తిని రేపాడు. క్లైమాక్స్ లో ఊహించని విధంగా కథను కీలక మలుపు తిప్పి నీలకంఠ తన మార్కును చూపించారు. ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే కొంత వేగం పెరిగి ఉండేది. ప్రేక్షకుడ్ని థియేటర్ కు రప్పించే బలమైన అంశాలు లేకపోవడం కొంత నిరాశే. ఓవరాల్ గా వినోదమే ప్రధానంగా రూపొందుతున్న ప్రస్తుత ట్రెండ్ లో నీలకంఠ తాజా థ్రిల్లర్ చిత్రం 'మాయ' చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులాగాల్సిందే. -
అంజలి లేకపోతే ఈ సినిమా లేదు
‘‘ఇప్పటికి 45 కథలు రాసిన నాకు రాజకిరణ్ చెప్పిన ఈ కథ విని నేనెందుకిలా ఆలోచించలేకపోయానా అనిపించింది. భారీ చిత్రాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నేను ఇలాంటి కథలను మరచిపోతున్నానేమో అనిపించింది. అంజలి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసేవాళ్లమే కాదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆయన సమర్పణలో, అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. వీవీ వినాయక్, గోపీచంద్, మంచు లక్ష్మి పాటల సీడీలను ఆవిష్కరించి, ఎమ్మెల్యే కోన రఘుపతికి అందించారు. వినాయక్ మాట్లాడుతూ -‘‘అసలు దెయ్యాలే లేవనే నమ్మే బ్రహ్మానందంగారికి దెయ్యం కనిపిస్తే పరిస్థితి ఏమిటనేది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ -‘‘మామూలు సినిమాల్లో బ్రహ్మనందం భయపడితే వంద రోజులు ఆడుతున్నాయి. అదే హారర్ సినిమాలో బ్రహ్మానందంగారు భయపడితే తప్పకుండా 150 రోజులు ఆడుతుంది’’ అని చెప్పారు. ఇది తనకు స్పెషల్ మూవీ అని అంజలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్, పోనీ వర్మ, దశరథ్, శ్రీవాస్, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, వీరు పోట్ల, మెహర్ రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో, మోనాల్ గజ్జర్, నీరజ కోన తదితరులు మాట్లాడారు. -
ఊహకు అందని రీతిలో...
అందమైన అమ్మాయితో స్నేహం ఏ కుర్రాడికైనా ఆనందమే. అదే ఆ కుర్రాడు సినీ దర్శకుడైతే... కొత్త కొత్త కథలు పుడుతుంటాయి. సినిమా దర్శకునిగా ఎదగాలనుకుంటున్న ఓ కుర్రాడి రూమ్‌కి ఓ అమ్మాయి వచ్చి పోతుంటుంది. ఆ అమ్మాయి రాక, అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ ‘గీతాంజలి’. అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు రాజకిరణ్ చెబుతూ -‘‘ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ప్రయత్నమిది. అంజలి పాత్ర చిత్రణ ఊహలకు అందని రీతిలో ఉంటుంది. వినోదంతో పాటు ఉత్కంఠకు లోనుచేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే నెల 3, 6, 7 తేదీల్లో బ్రహ్మానందంపై చిత్రీకరించే సన్నివేశాలతో టాకీ పూర్తవుతుంది. అదే నెల 9 నుంచి మూడు రోజుల పాటు అంజలి, హర్షవర్దన్ రాణేలపై చిత్రీకరించే మాంటేజస్ సాంగ్‌తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. అదే నెలలో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావురమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్. -
సినిమా రివ్యూ: అనామిక
నటీనటులు: నయనతార, హర్షవర్ధన్ రాణే, వైభవ్, పశుపతి, నరేశ్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ కెమెరా: విజయ్ సి. కుమార్ పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: కీరవాణి దర్శకత్వం: శేఖర్ కమ్ముల ప్లస్ పాయింట్స్: నయనతార క్లైమాక్స్ కెమెరా మైనస్ పాయింట్స్: తొలిభాగం ఫీల్ లేకపోవడం థ్రిల్లర్ సినిమాకు తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన టేస్ట్ కు దూరంగా బాలీవుడ్ లో విజయవంతమైన 'కహానీ' చిత్రాన్ని రీమేక్ గా 'అనామిక' చిత్రాన్ని రూపొందించారు. కహానీ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న విద్యాబాలన్ పాత్రను తెలుగు, తమిళంలో నయనతార పోషించింది. కహానీ చిత్రానికి కొన్ని మార్పులు వేసి రూపొందించిన అనామిక చిత్రం మే 1 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించిన 'కహానీ' చిత్రం మాదిరిగానే అనామిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథ గురించి తెలుసుకుందాం! కథ: అమెరికాలో అనామిక (నయనతార) ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫేషనల్. తప్పిపోయిన తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే) ఆచూకీ తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న అనామిక పాతబస్తీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అయితే అజయ్ శాస్త్రి కిడ్నాప్ గురయ్యాడనే విషయాన్ని అనామిక తెలుసుకుంటుంది. తన భర్తను ఆచూకీ తెలుసుకోవడానికి అనామిక కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు అజయ్ శాస్త్రిని కలుసుకుందా? అజయ్ శాస్త్రిని కలుసుకున్నఅనామిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు జవాబే ఈ చిత్రం. నటీనటుల పెర్పార్మెన్స్: అనామికగా నయనతార పాత్రే ఈ చిత్రంలో కీలకం. కెరీర్ లో నయనతార మరో విభిన్నమైన పాత్రను పోషించారు. తనకు అందివచ్చిన అనామిక పాత్రను పోషించడంలో నయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. తన భర్త కోసం వెతుక్కుంటూ వచ్చి, ఇబ్బందులకు గురయ్యే మహిళపై సానుభూతి సహజంగానే ఉంటుంది. అయితే ఆ సానుభూతిని ప్రేక్షకుల్లో నయనతార కలిగించలేకపోయింది. ఓవరాల్ గా నయనతార మంచి ఫెర్ఫార్మెన్స్ నే అందించింది. కథలో బాగంగా వచ్చే ఇన్స్ పెక్టర్ సారధి (వైభవ్ రెడ్డి), హోంమంత్రి (నరేశ్), దర్యాప్తు అధికారి (పశుపతి) లాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. వారి పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. హర్షవర్ధన్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంతగా లేదు. సాంకేతిక నిపుణుల పనితీరు: థ్రిలర్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు అత్యంత ప్రాదాన్యత ఉంటుంది. నటీనటుల ఎమోషన్స్, పరిస్థితులను తగినట్టుగా కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు 'అనామిక'కు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాటలు ఈ చిత్రంలో ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఒకటి, రెండింటితో సరిపెట్టారు. ఎడిటింగ్ పై దర్శకులు మరింత దృష్టి పెట్టాల్సిందనిపించింది. విజయ్ కుమార్ పనితీరు బాగుంది. ఇక 'కహానీ' రీమేక్ అనగానే అనేక రకాలైన పోలికలు ఉండటం సహాజం. కహానీలో విద్యాబాలన్ గర్బవతి. గర్భవతిగా ఉన్న ఓ యువతి భర్త కోసం వెతుక్కుంటూ వచ్చిందనే కథలోనే సానుభూతి క్రియేట్ అవుతుంది. అయితే ఓ యువతి కష్టాల్లో ఉందనే అంశమే ఆ పాత్రపై సానుభూతి కలిగిస్తుందనే భావనతో నయనతారను ప్రెగ్నెంట్ గా చూపించకూడదని శేఖర్ కమ్ముల నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యాబాలన్ పాత్రపై కలిగే సానుభూతిని తెరమీద అనామిక పాత్రకు కల్పించడంలో దర్శకులు కొంత సఫలం కాలేదనే చెప్పవచ్చు. తొలిభాగం కథను చాలా నెమ్మదిగా నడిపించిన శేఖర్ కమ్ముల.. క్లైమాక్స్ లో విజృంభించాడనే చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాలో ఉండే పక్కా స్క్రీన్ ప్లే, ఇంట్రస్ట్ కలిగించే సన్నివేశాలు.. ఏం జరుగబోతుందనే టెన్సన్ ను కలిగించడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురయ్యాడు. కొన్ని పాత్రల విషయంలో అనేక సందేహాలను రేకేత్తించారు. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునే బాధ్యతను దర్శకుడు ప్రేక్షకుడికే వదిలివేయడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా, కహానీ రేంజ్ లో సానుభూతి సంపాదించుకోలేకపోయినా... అనామిక ఓ మోస్తారుగా ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. ట్యాగ్: అనామిక 'స్పీచ్ లెస్' -
సినిమా రివ్యూ: ప్రేమ ఇష్క్ కాదల్
టాలీవుడ్లో చిన్న చిత్రాలు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో పబ్లిసిటి, మీడియా ప్రమోషన్ ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్. ఈ చిత్రాన్ని డి సురేష్‌బాబు సమర్పించడంతో మరింత క్రేజ్ పెంచడం, మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ను చేరుకోవడం లాంటి అంశాలు ఫీల్ గుడ్ మూవీ అనేంతగా ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం విడుదలకు ముందే మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాల్లో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం అంచనాలను చేరుకుందా అనేది ఓసారి పరిశీలిద్దాం. రణధీర్ అలియాస్ రాండీ (హర్షవర్ధన్ రాణే)-సరయు (వితికా షేరూ), రాయల్ రాజు(విష్టువర్ధన్)-సమీరా రీతూ శర్మ, అర్జున్ (హరీష్ వర్మ)-శాంతి(శ్రీముఖి) అనే మూడు జంటలకు సంబంధించిన మూడు ప్రేమ కథల చిత్రంగా ప్రేమ ఇష్క్ కాదల్ తెరకెక్కింది. ఓ కాఫీ షాప్ యజమాని అయిన ర్యాండీకి మ్యూజిక్ అంటే ప్రాణం. తన కాఫీ షాప్‌కు వచ్చే కస్టమర్లను తన పాటలతో ఆలరిస్తూ ఉంటాడు. ర్యాండీ చేత తన కాలేజిలో పాట పాడించాలనుకున్న సరయూ అతని వెంట పడుతుంది. ఆ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. రాయల్ రాజు ఓ సినిమా అసిస్టెంట్ డెరైక్టర్.. అతను షూటింగ్‌కు వచ్చిన సమీరా అనే క్యాస్టూమ్ డిజైనర్‌తో కలిగిన పరిచయం ఇద్దరిని దగ్గరయ్యేలా చేస్తోంది. అర్జున్ అనే రేడియో జాకీ ఓ ప్లేబాయ్.. ఎప్పుడూ అమ్మాయిలే జీవితంగా భావించే అర్జున్ చెన్నై నుంచి వచ్చిన ఓ సాఫ్వేర్ ఇంజినీర్ శాంతిని చూసి ఇష్టపడుతాడు. ఇలా మూడు జంట మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి? మూడు జంటల మధ్య చోటుచేసుకున్న అపార్ధాలు, అభిప్రాయ విభేదాలు ఎలా పరిష్కరించుకున్నారు? మూడు జంటల ప్రేమ కథలకు ముగింపేమిటో తెలుసుకోవాలంటే ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో మూడు జంటలుగా నటించిన అందరూ దాదాపు కొత్తవారే అయినప్పటికి వ్యక్తిగతంగా చక్కటి ప్రతిభను కనబరిచారు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేకూర్చారు. సంగీతకారుడిగా హర్షవర్ధన్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న రాయల్ రాజులో విష్టువర్ధన్, అర్జున్ హరీష్‌లు తమ వంతు న్యాయం చేశారు. నూతన హీరోయిన్లు ముగ్గురు కూడా మెచ్యూరిటి ఉన్న స్టార్లుగా కనిపించారు. స్టార్ యాక్టర్‌గా సత్యం రాజేశ్, ఇతర కమెడియన్లు తమ మార్కును ప్రదర్శించలేకపోయారు. ఈ చిత్రానికి కెమెరా, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చాలా రిచ్‌గా కనిపించడానికి కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి, శ్రవణ్ సంగీతం కీలకపాత్రను పోషించాయి. బెక్కం వేణుగోపాల్ నిర్మాణ విలువలు అప్రిషియేట్ చేసే రేంజ్లో ఉన్నాయి. కొత్త తారల ప్రతిభ, మంచి ఫోటోగ్రఫి, ఇంపైన సంగీతం లాంటి అంశాలను సానుకూలంగా మలుచుకుని చిత్రాన్ని హిట్ గా మలుచుకోవడంలో దర్శకుడు పవన్ సాదినేని తడబాటుకు గురైనట్టు కనిపించింది. తొలి భాగం చాలా నెమ్మదించడం, ప్రేక్షుకుడికి ఆసక్తిని కలిగించే అంశాలు లేక పోవడం బోర్ కొట్టించదనే చెప్పవచ్చు. ఎడిటింగ్ పరంగా కూడా క్రిస్ప్‌గా లేకపోవడం, స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండటం ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. నేటి యూత్‌లో ఎలాంటి ట్రెండ్ ఉందో అనే విషయాన్ని కథగా ఎంచుకోవడం బాగానే ఉంది. అయితే అలాంటి కథను యూత్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ఇక మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసమే ఈ చిత్రం తీశారనే భావన కలగడం ఈ చిత్ర విజయావకాశాలపై ప్రభావం చూపడం ఖాయం. ఏది ఏమైనా రొమాంటిక్ కామెడీగా రూపొందించే క్రమంలో పూర్తి స్థాయిలో వినోదాన్ని, ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్ ను మిస్ అవడం ప్రేక్షకుడ్ని నిరాశకు గురిచేసే అంశంగా చెప్పవచ్చు. మల్టిప్లెక్స్, బి, సీ గ్రేడ్ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే చిత్రం విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.