Sanjeeda Shaikh Secretly Dating Harshvardhan Rane, Pic Viral - Sakshi
Sakshi News home page

Harshvardhan Sanjeeda Dating: మూడో గర్ల్‌ఫ్రెండ్.. రెండో బాయ్ ఫ్రెండ్!

Published Tue, Jul 11 2023 6:21 PM | Last Updated on Tue, Jul 11 2023 9:02 PM

 Harshvardhan Rane Sanjeeda Sheikh Dating Pic - Sakshi

Harshvardhan Sanjeeda Dating: సాధారణంగా టాలీవుడ్‌లో హీరోయిన్లకు అవకాశాలు తక్కువని అంటారు. చాలావరకు అది నిజమేనని అనుకుంటారు. కానీ ఓ తెలుగు నటుడికి కూడా ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ‍్లిపోయాడు. అక్కడే హీరోగానూ నటిస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పుడు అతడు ఏకంగా ఓ పెళ్లయిన నటితో కలిసి డేటింగ్ చేస్తున్నాడు. కొన్ని ఫొటోలు వైరల్ అయ్యేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

(ఇదీ చదవండి: 'సలార్' vs 'జవాన్'.. ఇదెక్కడి గొడవరా బాబు!?)

రాజమండ్రి కుర్రాడు హర్షవర్ధన్ రానే.. తెలుగులో అవును, ఫిదా, గీతాంజలి, బెంగాల్ టైగర్ తదితర సినిమాల్లో నటించాడు. కానీ మన డైరెక్టర్స్ ఎవరూ ఇతడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బాలీవుడ్‌లో ట్రై చేశాడు. అక్కడ క్లిక్ అయిపోయాడు. దీంతో హిందీలో వరసగా సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఇతడు.. లేడీ యాక్టర్స్ కిమ్ శర్మ, మీనాక్షి దాస్ తో డేటింగ్ చేశాడు. వాళ్లతో ఎందుకో ఇతడికి సెట్ కాలేదు. దీంతో విడిపోయారు.

ఇ‍ప్పుడు మాత్రం హిందీ నటి సంజీదా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి తాజాగా టూర్‌కి వెళ్లారు. సంజీదాకు ఇప్పటికే పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. నటుడు ఆమిర్ అలీని 2012లో వివాహం చేసుకున్న ఈమె..‍ గతేడాది విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు హర్షవర్ధన్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీడియా ప్రతినిధులు హర్షని దీని గురించి అడిగితే.. ఎటు తేల్చకుండా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో డేటింగ్ నిజమేనని తేలింది.

(ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement