ఫిట్ టుగేదర్.. ఫిట్ అండ్ ఫన్ | FIT and Fun Ways to get Fit Together | Sakshi
Sakshi News home page

ఫిట్ టుగేదర్.. ఫిట్ అండ్ ఫన్

Published Tue, Aug 12 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఫిట్ టుగేదర్.. ఫిట్ అండ్ ఫన్

ఫిట్ టుగేదర్.. ఫిట్ అండ్ ఫన్

వీకెండ్ పార్టీలను మాత్రమే కాదు. వర్కవుట్‌ని కూడా షేర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ కపుల్. హార్ట్ బీట్ లాంటి అమ్మాయో, అబ్బాయినో పార్ట్‌నర్‌గా మార్చుకుని 1, 2, 3 అని కౌంట్ చేస్తూ కసరత్తులు చేసేస్తుంటే... ‘జిమ్’దగీ కే లియే... బస్  ఏక్ సనమ్ చాహియే ఆషికీ కేలియే’పాట విన్నంత హ్యాపీ. ఆ హ్యాపీనెస్‌లో వర్కవుట్స్ అలసట అంతా దూ.పి... అదేనండీ దూది పింజే... పైగా బోలెడంత ఫన్ కూడాను.  ప్రత్యేకంగా సిటీప్లస్ కోసం ‘మాయ’ సినిమా జంట హర్షవర్ధన్ రాణే, అవంతికలు వర్కవుట్‌కు ఫన్ మిక్స్ చేసి చేసిన ఫిట్ అండ్ ఫన్ ఫీట్లివి.
 
 బెంచ్‌ప్రెస్ చేసేటప్పుడు బార్‌బెల్‌కి వెయిట్ వేసుకుని చేస్తారు. అయితే ఇక్కడ నేలనే బెంచ్ చేసుకుని అమ్మాయినే వెయిట్‌గా మార్చుకున్నాడీ అబ్బాయి.
 
 లైట్‌వెయిట్ డంబెల్‌ను అమ్మాయి, సరిపడా వెయిట్ డంబెల్‌ను అబ్బాయి అందుకున్నారు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మిర్రర్‌లో తమ బ్యూటీఫుల్ ఫిజిక్‌లను చూసుకుంటూ చేస్తే ఎన్ని లిఫ్టేషన్స్  చేసినా అలసట రాదని చెబుతున్నారీ జంట.
 
 ఇన్‌స్పిరేషన్ ఇంపార్టెంట్. ఏ పనికైనా. అందులో గాల్‌ఫ్రెండే ట్రైనర్ పోస్ట్‌లోకి వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే  అబ్బాయి ఆగుతాడా? బైసప్‌ని షేపప్ చేసేయ్యడూ...
  స్ట్రెచ్చింగ్  ఎక్సర్‌సైజ్ కలసి చేసే ప్రయత్నంలో చేతిలో స్విస్‌బాల్‌ను కూడా పట్టుకుని  బాడీని విభిన్న రకాలుగా స్ట్రెచ్ చేస్తున్నారీ బ్యూటీఫుల్ కపుల్.
 
 వర్కవుట్స్ చేసిన తర్వాత  ఎనర్జిటిక్‌గా. కొండల్ని పిండిచేసేంత శక్తి వచ్చినట్టుంటుంది. ఆ సమయంలో కిక్ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్‌ను ట్రై చేస్తే.. ఫన్‌కి ఫన్, ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్.  
 
 వర్కవుట్స్ అన్నీ అయిపోయాక ఇద్దరూ ఒకేసారి బాడీని స్ట్రెచ్ చేయడానికి ఇదేదో మంచి ఐడియా అనిపిస్తుంది కదూ...
 
 (వీటిలో కొన్ని ఫీట్లు కసరత్తుల్లో కాకలు తీరినవారు మాత్రమే చేసేవి.
 జస్ట్... సరదా కోసం, కపుల్ కంబైన్డ్‌గా చేస్తే కలిగే హ్యాపీనెస్‌ను
 తెలిపేందుకు మాత్రమే ఇవి తప్ప ట్రై చేయమని చెప్పడానికి కాదు.)  
 జిమ్ కర్టెసీ: హెలియోస్, జూబ్లీహిల్స్
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement