మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్ | Maniratnam Gharshana remake with Harshavardhan rane | Sakshi
Sakshi News home page

మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్

Published Thu, May 12 2016 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్

మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్

సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ఘర్షణ. తమిళ్లో అగ్ని నచ్చతిరం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. డబ్బింగ్ వర్షన్ గా తెలుగులో రిలీజ్ అయి ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అంతేకాదు 200 రోజులు పాటు ఆడిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. అదే సినిమాను వన్ష్ పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

విక్కీ కౌశల్, హర్షవర్థణ్ రాణేలు హీరోలుగా బెజాయ్ నంభియార్ దర్శకత్వంలో ఘర్షణ సినిమా మరోసారి రీమేక్ అవుతోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వాజీర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న బెజాయ్, ఘర్షణ రీమేక్ తో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. పాతికేళ్ల క్రితం సంచలనాలు సృష్టించిన ఘర్షణ ఈ తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement