కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.
డేనియల్ బాలాజీ ఎక్కువగా విలన్ రోల్స్‌లోనే నటించాడు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో కనిపించిన డేనియల్.. తెలుగులో సాంబ, ఘర్షణ,చిరుత,టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. కమల్ హాసన్ విడుదల కాని సినిమా 'మరుదనాయగం' సెట్స్‌లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా బాలాజీ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.
(ఘర్షణ సినిమాలో వెంకటేశ్‌తో)
బాలాజీ మొదటి పాత్ర టెలివిజన్ ధారావాహిక 'చితి' , అక్కడ అతను 'డేనియల్' అనే పాత్రను పోషించాడు. 'పిన్ని' పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్‌గా అయ్యింది. ఈ సీరియల్ హిట్ అయిన తర్వాత, అతని రెండవ ధారావాహిక 'అలైగల్'లో , దర్శకుడు సుందర్ K. విజయన్, 'చితి'లో తన పాత్రను తానే పోషించాడని భావించి అతనికి 'డేనియల్ బాలాజీ' అని పేరు పెట్టారు .
(బిగిల్ సినిమా సెట్స్‌లో విజయ్‌తో డేనియల్)
డేనియల్ బాలాజీకి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆయన తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి.. కాగా తల్లి తమిళ్ కుటుంబానికి చెందిన వారు. డైరెక్టర్ కావాలని ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకున్న డేనియల్ బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డాడు. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన గౌతమ్‌మీనన్‌తో డేనియల్ బాలాజీకి మంచి స్నేహం ఉంది. గద్దలకొండ గణేష్ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన అథర్వ మురళితో బంధుత్వం ఉంది. డేనియల్ అమ్మగారి నుంచి అథర్వతో బంధుత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment