కార్తీ కొత్త మూవీ టీజర్.. టైటిల్ వింతగా ఉందేంటి? | Kollywood Star Karthi Latest Movie Vaa Vaathiyaar Teaser Out Now | Sakshi
Sakshi News home page

Vaa Vaathiyaar Teaser: కార్తీ కొత్త మూవీ టీజర్.. టైటిల్ వింతగా ఉందేంటి?

Published Wed, Nov 13 2024 6:42 PM | Last Updated on Wed, Nov 13 2024 7:09 PM

Kollywood Star Karthi Latest Movie Vaa Vaathiyaar Teaser Out Now

ఇటీవల సత్యం సుందరం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను ‍అలరించిన కోలీవుడ్ స్టార్‌ కార్తీ. గతనెల విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించారు.అయితే కార్తీ తాజాగా మరో సినిమాకు రెడీ అయిపోయారు.

కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం వా వాతియార్. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

కాగా.. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్‌ సంగీతమందిస్తున్నారు. వా వాతియార్‌ మూవీలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్, విద్యా బోర్గియా, నివాస్ అద్ధితన్, మధుర్ మిట్టల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement