
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో నటించింది.
తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.
డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్‌లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment