ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ కాంప్లిమెంట్ : వర్మ | It is the best compliment in my entire career tweets Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ కాంప్లిమెంట్ : వర్మ

Published Fri, Mar 29 2019 2:29 PM | Last Updated on Fri, Mar 29 2019 2:45 PM

It is the best compliment in my entire career tweets Ram Gopal Varma - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మిగతా చోట్ల విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజునే ఎన్నో వాయిదాల తర్వాత తాను తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సరిగ్గా అదే రోజు విడుదలవ్వడం అంతా యాదృచ్చికమే అయినా నమ్మలేకపోతున్నానని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. దేవుళ్ల దీవెనలు తమకే ఉన్నాయని పేర్కొన్నారు. గూగుల్‌ సెర్చ్‌లో తెలుగు దేశం ఆవిర్భావం తేదీని స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 1989లో అక్కినేని శివ, 2019లో నందమూరి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. 

రామ్‌గోపాల్‌ వర్మ గారు వొళ్లు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా అని ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు బీవీఎస్‌ రవి చేసిన ట్వీట్‌కు సర్‌, ఏదో పొరపాటు జరిగిపోయింది, మన్నించండి అంటూ వర్మ సరదాగా బదులిచ్చారు. ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు మీరే అనుకుంటున్నా అని హీరో హర్ష వర్ధన్‌ చేసిన ట్వీట్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా వర్మ పేర్కొన్నారు.

ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేక్‌ వేసిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాకేష్‌రెడ్డికి సూచించింది. 

చదవండి : ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement