అభిమానులు మెచ్చే సినిమాలే చేస్తా : హీరో | fida film success celebration in tirupati | Sakshi
Sakshi News home page

అభిమానులు మెచ్చే సినిమాలే చేస్తా : హీరో

Published Fri, Aug 4 2017 8:33 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

అభిమానులు మెచ్చే సినిమాలే చేస్తా : హీరో

అభిమానులు మెచ్చే సినిమాలే చేస్తా : హీరో

► తిరుపతిలో ‘ఫిదా’ యూనిట్‌ సందడి

తిరుపతి‌: ఫిదా విజయోత్సవ యాత్రలో భాగంగా  గురువారం ఆ చిత్రం యూనిట్‌ తిరుపతిలో అభిమానుల మధ్య  సందడి చేసింది. సంధ్య థియేటర్‌కు చేరుకున్న చిత్ర యూనిట్‌కు సినిమాహాలు యాజమానులు, వరుణ్‌తేజ్‌ అభిమానులు పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. థియేటర్‌లో  ఫిదా సినిమాను  చిత్రం యూనిట్‌ కొంతసేపు అభిమానులతో కలిసి వీక్షించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థియేటర్‌లోని వేదికపై  చిత్రం హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్‌ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు అభిమానులకు అభివాదం చేస్తూ  ఆనందాన్ని పంచుకున్నారు.  

హీరో, హీరోయిన్‌ వరుణ్‌తేజ్, సాయిపల్లవి చిత్రంలోని డైలాగ్స్‌  చెప్పి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. అభిమానులు కేరింతలతో  థియేటర్‌ హోరెత్తించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ఫిదా చిత్రం పట్ల  అభిమానులు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అభిమానుల సందడి చేస్తుంటే  ఈ చిత్రం విజయం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. అభిమానుల కోసం ఇంకా మంచి మంచి చిత్రాల్లో నటిస్తానని తెలిపారు.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు  మాట్లాడుతూ..  పవన్‌కల్యాణ్‌కు ఖుషి, అల్లుఅర్జున్‌కు బన్నీ సినిమా  ఇమేజ్‌ను తీసుకొచ్చాయని,  ఫిదా సినిమాతో  వరుణ్‌తేజ్‌కు కూడా గుర్తింపు లభించిందన్నారు.  సినిమా విడుదలై రెండు వారాలు కావస్తున్నా ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభించడం ఆనందదాయకంగా ఉందన్నారు.   రాయలసీమ ప్రేక్షకులు తమ సినిమాను మరింత ఆదరించి విజయాన్ని చేకూర్చారని తెలిపారు. టీటీడీ రిటైర్డ్‌ డెప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ మాట్లాడుతూ  మంచి సినిమాలను సీమ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తెలి పారు. సినీ నిర్మాత ఎన్‌వీ.ప్రసాద్,  నటుడు రాజేష్, చిత్రంలోని నటీనటులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement