అమెరికా అబ్బాయి... ఇక్కడ అమ్మాయి | Fida movie release on July 21 | Sakshi
Sakshi News home page

అమెరికా అబ్బాయి... ఇక్కడ అమ్మాయి

Published Mon, Jun 12 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

అమెరికా అబ్బాయి... ఇక్కడ అమ్మాయి

అమెరికా అబ్బాయి... ఇక్కడ అమ్మాయి

బయట చిన్నగా చినుకులు కురుస్తున్నప్పుడు... ప్రేయసి పక్కనే కూర్చుని తీయని పలుకులు వింటూ... తెరపై మాంచి కాఫీ లాంటి ప్రేమకథా చిత్రం చూస్తుంటే... ఎలా ఉంటుందో? ఒక్కసారి ఊహించుకోండి! భలే ఉంటుంది కదూ! బహుశా... హీరోలు, దర్శక–నిర్మాతలకు ఈ కిటుకు బాగా తెలుసేమో! రొమాంటిక్‌ సిన్మాలను రెయినీ సీజన్‌లోనే ఎక్కువ రిలీజ్‌ చేస్తుంటారు.

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న రొమాంటిక్‌ సిన్మా ‘ఫిదా’ కూడా రెయినీ సీజన్‌లో రానుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ను జూలై 21న విడుదల చేస్తారని సమాచారం. మలయాళ ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఓ పాట మినహా పూర్తయింది. ‘ఆనంద్, గోదావరి’ సినిమాల తర్వాత శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అమెరికా ఎన్నారై, తెలంగాణ అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథే ఈ చిత్రకథ. ఓ పాట మినహా ‘ఫిదా’ చిత్రీకరణ పూర్తయిందట! జూలై 21న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement