బంగారం చిన్నోడు.. ఫిదా చిన్నది... | Sai Pallavi To Romance Dulquar Salman | Sakshi
Sakshi News home page

బంగారం చిన్నోడు.. ఫిదా చిన్నది...

Published Tue, Aug 1 2017 11:34 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

బంగారం చిన్నోడు.. ఫిదా చిన్నది...

బంగారం చిన్నోడు.. ఫిదా చిన్నది...

ఏం పిల్లరా... యెల్లట్లేదు మైండ్‌లోంచి. భలే నటించిందిరా! అంటున్నారు ‘ఫిదా’లో సాయి పల్లవిని చూసినోళ్లు. తెలుగు ప్రేక్షకులను అంతగా ఫిదా చేసిన ఈ అమ్మాయి వచ్చే నెల్లో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే... స్ట్రయిట్‌ తెలుగు సినిమాతో కాదు. మలయాళ అనువాదంతో మనల్ని పలకరించనున్నారు. ‘ఓకే బంగారం’ ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్, సాయి పల్లవి జంటగా సమీర్‌ తాహిర్‌ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా ‘కలి’ను ప్రముఖ సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ డీవీ కృష్ణస్వామి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

 ప్రస్తుతం తెలుగు డబ్బింగ్, మిక్సింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల రెండో వారంలో టైటిల్‌ ప్రకటించి, సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: భాషా శ్రీ, సాహిత్యం: సురేంద్ర కృష్ణ, సంగీతం: గోపీసుందర్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిణ్‌ శ్రీనివాస్, సహ–నిర్మాత: వి. చంద్రశేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement