నటుడితో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి! | I am not a Malayali, says actress Sai Pallavi | Sakshi
Sakshi News home page

నటుడితో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి!

Published Tue, Oct 24 2017 6:51 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

I am not a Malayali, says actress Sai Pallavi - Sakshi

అదృష్టం అంటే ఆమెదేనని చెప్పొచ్చు. ఆమె మరెవరో కాదు నటి సాయిపల్లవి. ప్రేమమ్‌ చిత్రంతో మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ చిత్రంలో మలర్‌ టీచర్‌గా నటించి విశేషం గుర్తింపును పొందింది. అక్కడే అలా అంటే ఆ తరువాత టాలీవుడ్‌కు ఫిదా చిత్రంతో రంగప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇక తమిళ సినీ రంగానికి కరు చిత్రం ద్వారా అడుగుపెట్టింది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న ఈ చిత్రం విడుదల కాకముందే ధనుష్‌తో మారి-2 చిత్రంలో రొమాన్స్‌కు రెడీ అవుతోంది.

ప్రస్తుతం కోలీవుడ్‌లో కరు చిత్రం తెచ్చిపెట్టే పేరు కోసం ఎదురు చూస్తున్న సాయిపల్లవిని చాలామంది మలయాళీ అమ్మాయి అంటున్నారట. అంతేకాదు ఈ అమ్మడు ఒక కోలీవుడ్‌ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతోందని చెవులు కొరుక్కుంటున్నారట. అయితే ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా తనను మలయాళీ అమ్మాయి అని అనకండని, తాను కోయంబత్తూర్‌లో పుట్టిన పక్కా తమిళ అమ్మాయినని అంటోంది. మొత్తం మీద తన ప్రేమ, ప్రియుడు అన్న విషయాలను ఖండించలేదంటే ఈమెకో లవర్‌ ఉన్నాడన్న విషయం కొట్టిపారేయలేం అంటున్నాయి కోడంబాకం వర్గాలు. ఇక అతగాడెవరన్నది తెలియాల్సి ఉందని పేర్కొంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement