నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..? | Director Sreenu Vaitla to venture into tv production | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..?

Published Thu, Apr 13 2017 2:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..?

నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..?

స్టార్ హీరోలతో వరుస సక్సెస్లు సాధించిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల. ప్రస్తుతం కెరీర్లో బ్యాడ్ ఫేజ్ను ఎదుర్కొంటున్న ఈ కామెడీ స్పెషలిస్ట్ తన లేటెస్ట్ మూవీ మిస్టర్తో మరో సారి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న మిస్టర్, దర్శకుడు శ్రీనువైట్లతో పాటు హీరో వరుణ్ తేజ్ కెరీర్కు కూడా కీలకం కానుంది. అయితే ఇటీవల కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనువైట్ల భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అందుకే దర్శకత్వంతో పాటు సొంతంగా బిజినెస్ ప్రారంభించే ప్లాన్లో ఉన్నాడు. వెండితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీనువైట్ల తన తొలి వ్యాపార ప్రయత్నం మాత్రం బుల్లితెర మీద చేస్తున్నాడు. యూట్యూడ్ స్టార్గా పేరు తెచ్చుకున్న వైవా హర్షతో ఓ కామెడీ షోను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షోకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడిగా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన కామెడీ జానర్నే నిర్మాతగానూ నమ్ముకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement