అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్‌ | cini director srinu vaitla went to the simhachalam | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్‌

Published Thu, Apr 13 2017 6:35 PM | Last Updated on Sat, Aug 11 2018 8:30 PM

అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్‌ - Sakshi

అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్‌

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల గురువారం దర్శించుకున్నారు. వరుణ్‌తేజ్, హెబ్బాపటేల్, లావణ్యత్రిపాఠి నటించిన మిస్టర్‌ సినిమా శుక్రవారం విడుదల అవుతుండటంతో ఆ సినిమా విజయవంతం అవ్వాలని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామికి శ్రీను వైట్ల పూజలు నిర్వహించారు. సెన్సార్‌ స్క్రిప్టును స్వామి సన్నిధిలో ఉంచి అష్టోత్తర పూజ చేశారు. కప్పస్తంభానికి మొక్కుకున్నారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనువైట్ల స్థానిక విలేకర్లతో మాట్లాడారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఎంతో ఇష్టదైవమన్నారు. ప్రతీ సినిమా రిలీజ్‌కి ముందు స్వామిని దర్శించుకోవడం జరుగుతోందన్నారు. సింహగిరికి ఎప్పుడు వచ్చినా పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందన్నారు. లక్ష్మీనరసింహ బేనర్‌పై తెరకెక్కిన మిస్టర్‌ సినిమా ఒక ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మిస్టర్‌ సినిమా అలరిస్తుందన్నారు. ప్రస్తుతం రెండు కథలు సిద్దం చేసుకున్నానని, తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement