
వరుణ్ సినిమాలో మరో హీరో
యంగ్ జనరేషన్ హీరోలు కొత్త సాంప్రదాయాలకు తెర తీస్తున్నారు. గతంలో ఒక హీరో సినిమాలో మరో హీరో అతిథి పాత్రలో నటించిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఈ జనరేషన్ హీరోలు మాత్రం తరుచుగా గెస్ట్ అపియరెన్స్ లకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా, తాజాగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో నటించేందుకు మరో హీరో అంగీకరించాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో మరో యంగ్ హీరో ప్రిన్స్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాలో కూడా ప్రిన్స్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. బస్స్టాప్, రొమాన్స్ లాంటి సినిమాలతో సోలో హీరోగా మంచి విజయాలను అందుకున్న ప్రిన్స్ మరోసారి స్పెషల్ క్యారెక్టర్ కు అంగకీరించాడు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ లు హీరోయిన్లు గా నటిస్తున్ మిస్టర్ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.