meharin Kaur
-
‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’
‘‘చూడచక్కగా ఉన్నారు. మీ జంట సూపర్’’ అంటూ మెహరీన్ స్నేహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్ పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తాజాగా మెహరీన్ స్కూల్ ఫ్రెండ్ తమన్నా నిశ్చితార్థంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫొటో చూసినవాళ్లు సూపర్ అంటున్నారు. ఈ శుక్రవారం (మార్చి 12) జైపూర్‌లోని అలీలా కోటలో మెహరీన్–భవ్య నిశ్చితార్థం జరగనుంది. భవ్యా బిష్ణోయ్ హరియానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు. భవ్య కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. మెహరీన్–భవ్యాల వివాహ తేదీని నిశ్చితార్థం రోజున ప్రకటిస్తారట. ప్రస్తుతం మెహరీన్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఓ వారం హాలిడేస్!
మొన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు హాలిడేస్ వచ్చేశాయ్! హీరో సాయిధరమ్ తేజ్ (తేజు)కి కూడా దర్శకుడు బీవీయస్ రవి వారం రోజులు హాలిడేస్ ఇచ్చారు. తేజూ ఏం ఎగ్జామ్స్ రాశాడనుకుంటున్నారా? ‘జవాన్’ క్వార్టర్లీ ఎగ్జామ్స్. దర్శకుడి టీచింగ్స్, హీరో ఎగ్జామ్స్. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? తేజు, మెహరీన్ కౌర్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సినిమా ఓ స్కూల్ అనుకుంటే... దర్శకుడు టీచర్, నటీనటులు స్టూడెంట్సే కదా! శనివారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ (క్వార్టర్లీ ఎగ్జామ్స్) పూర్తయింది. ఫిల్మ్ నగర్లో ‘జవాన్’ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో 20 శాతం టాకీ పార్టు చేశారు. ఈ స్కూల్‌కి పక్క ఊరి నుంచి ఓ స్టూడెంట్ వస్తున్నాడండోయ్. అతడే ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నకుమార్. ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నారాయన. వారం రోజుల తర్వాత ‘జవాన్’ స్కూల్ (సెకండ్ షెడ్యూల్) ఓపెన్ చేస్తారు. ఈ చిత్రానికి కెమెరా: గుహన్, సంగీతం: తమన్. -
తొలిసారి రవితేజ అంధుడి పాత్ర
-
ఆ చిత్రాలను మించి హిట్ అవుతుంది
–‘దిల్’ రాజు మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘బెంగాల్ టైగర్’ వంటి హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు రెట్టించిన కొత్త ఉత్సాహంతో నూతన చిత్రాలను ఎక్స్‌ప్రెస్ లెవల్లో పట్టాలెక్కిస్తున్నారు. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు’ గత శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రవితేజ, మెహరీన్ కౌర్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ఎం.వి.ఆర్.ఎస్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నందమూరి కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. కాగా, ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించనున్నారు. చిత్ర సమర్పకుడు, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘భద్ర’ చిత్రం తర్వాత రవితేజతో, ‘సుప్రీమ్’ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో మా బ్యానర్లో చేస్తున్న చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ‘భద్ర’, ‘సుప్రీమ్’ చిత్రాల కంటే ‘రాజా ది గ్రేట్’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఇప్పటి వరకూ కనిపించని విలక్షణ పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులకు నచ్చేలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో రెండో చిత్రం చేయడం హ్యాపీ. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని తెలిపారు. నిర్మాత శిరీష్, దర్శకుడు సతీష్ వేగేశ్న పాల్గొన్నారు. -
జవాన్ వెనకుండి నడిపిస్తా
-
జవాన్ వెనకుండి నడిపిస్తా
–‘దిల్’ రాజు ‘‘ బీవీయస్ రవి, కృష్ణ... ఈ ముగ్గురికీ మా సంస్థతో మంచి అనుబంధం ఉంది. వీళ్లను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ కౌర్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘జవాన్’. ‘ఇంటికొక్కడు’ ఉపశీర్షిక. ఈ చిత్రం సోమవారం మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిన్న ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఈ చిత్రకథను రవి రెండేళ్ల కిందట చెప్పాడు. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో ఉంటుంది. నాతో అనుబంధం ఉన్న వీరు ముగ్గురూ కలిసి చేస్తున్న చిత్రానికి నా వంతుగా కథ, టెక్నీషియన్స్ ఫైనలైజ్ చేశా. మా సంస్థ నుంచి వచ్చే సినిమాలా ‘జవాన్’ ఉండేలా వారి వెనకుండి నడిపిస్తున్నా’’ అన్నారు. ‘‘మంచి కథ, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో రాబోతున్నాం’’ అని సాయిధరమ్ చెప్పారు. ‘‘దేశానికి సైనికుడులా.. ప్రతి ఇంటికి ఒక సమర్థుడైన కొడుకు అవసరం. దేశానికి సమస్య వస్తే జవాన్ నిలబడతాడు.. ఇంటికి సమస్య వస్తే కొడుకు నిలబడతాడు అన్నదే కథాంశం’’ అని బీవీఎస్ రవి చెప్పారు. ‘‘నేను పనిచేసిన సినిమాలకు బీవీయస్రవిగారూ ఒక పార్ట్. ఆయన సినిమాకి పాటలివ్వ డం సంతోషం. సాయితో నాకిది మూడో సినిమా’’ అని తమన్ అన్నారు. -
వన్.. టు.. త్రీ.. రెడీ!
ప్రస్తుతం వరుణ్‌తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు. సుమారు ఏడెనిమిది నెలలు ఈ రెండు చిత్రాలతో వరుణ్ బిజీ. మధ్యలో కాలికి గాయం కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, ఇటీవలే చిత్రీకరణలో పాల్గొనడం మొదలుపెట్టారు. త్వరలో ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంతో బిజీ అవుతారు. ‘జ్ఙాపకం’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించిన వెంకీ అట్లూరి దర్శకుడిగా మారుతున్న ఈ ప్రేమకథా చిత్రంలో వరుణ్‌తేజ్‌కి జోడీగా మెహరీన్ కౌర్ నటించనున్నారు. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం. మొత్తం మీద ఈ ఏడాది వరుణ్‌తేజ్ మూడు సినిమాలు విడుదల చేసేలా కనపడుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. -
రాజా... నువ్వు గ్రేట్!
రవితేజ హీరోగా నటించబోయే కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ... టైటిల్ కూడా రెడీ! మంచి ముహూర్తం చూసి దర్శక–నిర్మాతలు షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. రామ్ దగ్గర్నుంచి ఎన్టీఆర్... అక్కణ్ణుంచి అటూ ఇటూ తిరిగిన బ్లైండ్మ్యాన్ స్టోరీ, చివరకు రవితేజ దగ్గరికి చేరిందట! ఈ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ‘పటాస్’, ‘సుప్రీమ్’ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి ‘రాజా... ది గ్రేట్’ టైటిల్ ఖరారు చేశారట! ‘‘ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ వెర్షన్ పూర్తయింది. మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవితేజ పాత్ర, సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో రవితేజకి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ మెహరీన్ కౌర్ నటించనున్నారు.