మూడో సినిమాను ఫైనల్ చేశాడు | bellamkonda srinivas third film with vijay kumar konda | Sakshi
Sakshi News home page

మూడో సినిమాను ఫైనల్ చేశాడు

Published Wed, Nov 18 2015 10:36 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

మూడో సినిమాను ఫైనల్ చేశాడు - Sakshi

మూడో సినిమాను ఫైనల్ చేశాడు

ఏ స్టార్ వారసుడూ పరిచయం కానంత స్థాయిలో గ్రాండ్గా లాంచ్ అయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీనివాస్, తొలి సినిమా అల్లుడు శీనుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఈ సారి మినిమమ్ గ్యారెంటీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో, ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండియన్ సినిమాకు రీమేక్గా ఈ సినిమా చేస్తున్నారు. తొలి సినిమాతోనే మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన శ్రీనివాస్... ఆ తరువాత మాత్రం లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ మూడో సినిమాగా లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి క్యూట్ లవ్ స్టోరీస్ను డైరెక్ట్ చేసిన విజయకుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన స్వాతి హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement