ప్రేమలో ఏడు కోణాలు | new movie l7 lanched | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఏడు కోణాలు

Aug 1 2016 1:01 AM | Updated on Nov 6 2018 8:51 PM

ప్రేమలో ఏడు కోణాలు - Sakshi

ప్రేమలో ఏడు కోణాలు

‘మనం’, ‘ఇష్క్’ చిత్రాలకు కథా సహకారం అందించిన ముకుంద్ పాండే తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎల్ 7’.

‘మనం’, ‘ఇష్క్’ చిత్రాలకు కథా సహకారం అందించిన ముకుంద్ పాండే తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎల్ 7’. అరుణ్ అదిత్, పూజా జవేరి జంటగా బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం లోగోను దర్శకుడు విజయ్ కుమార్ కొండా, ట్రైలర్‌ను నిర్మాతలు గొట్టిముక్కల పద్మారావు, డీఎస్ రావు విడుదల చేశారు. గొట్టిముక్కల పద్మారావు మాట్లాడుతూ- ‘‘ భోజ్‌పురిలో స్టార్ హీరోలతో చిత్రాలు తీసి, బడా నిర్మాతగా పేరు తెచుకున్నారు ఓబుల్ సుబ్బారెడ్డి. తెలుగులో ఆయనకు ‘ఎల్ 7’ రెండో చిత్రం. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తోంది. దర్శకుడు మంచి ప్రతిభ ఉన్నవాడు. బాగా తెరకెక్కించాడు’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రేమలోని ఏడు కోణాలను ఇందులో చూపించాడు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని విజయ్ కుమార్ కొండా పేర్కొన్నారు. ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ- ‘‘భోజ్‌పురిలో మంచి చిత్రాలు నిర్మించి విజయాలను అందుకున్నా.


తెలుగులో కూడా మంచి నిర్మాత అనిపించుకోవాలని ఉంది. ముకుంద్ చెప్పిన కథ నచ్చడంతో తననే దర్శకత్వం వహించమన్నా. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ వంటి అన్ని అంశాలు ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం. కిశోర్, సహ నిర్మాతలు: మోహనరావు.బి, సతీష్ కొట్టె, కె.పున్నయ్య చౌదరి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement