మూడు భాషల్లో థ్రిల్లర్..!
మూడు భాషల్లో థ్రిల్లర్..!
Published Mon, Feb 17 2014 12:30 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా వైభవంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి వెంటనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కొంత గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ చేస్తే, ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ అంత విజయవంతమైన సినిమానే చేయాలనే పట్టుదలతో ఉన్నారామె. అందుకే, కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఇటీవల శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ ఓ కథ విన్నారు. తల్లి, ఇద్దరు పిల్లల చుట్టూ సాగే కథ ఇది. పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్. ఈ కథ ఏ భాషకైనా బాగుంటుందని, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తే బాగుంటుందన్నది ఈ దంపతుల అభిప్రాయం. ఈ మూడు భాషల్లోనూ సమర్థవంతంగా తెరకెక్కించగల దర్శకుణ్ణి ఎంపిక చేయాలనుకుంటున్నారట. మరి.. ఈ భారీ ఆఫర్ ఏ దర్శకుడికి దక్కుతుందో?
Advertisement
Advertisement