![Sridevi Died From Accidental Drowning - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/26/sridevi-1.jpg.webp?itok=b7Qmfc6n)
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణంపై షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పటి వరకు అనుకున్నట్లు ఆమె గుండెపోటు కారణంగా చనిపోలేదు. ప్రమాదం కారణంతో ఆమె చనిపోయారు. అనుకోకుండా జారీ ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమె దేహంలో కొంతమేరకు ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. నీటి టబ్బులో నుంచి బయటకు తీసే సమయానికే శరీరం కొంత ఉబ్బిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు శవ పరీక్ష నివేదికను అప్పగించారు. పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం శనివారం సాయంత్రం పార్టీ నుంచి హోటల్‌లో గదికి వెళ్లిన శ్రీదేవి 7గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌కు వెళ్లారు.
అందులోనే అనుకోకుండా కాలు జారీ నీళ్ల టబ్‌లో పడిపోయారు. ఆ సమయంలోనే ఆమె తీవ్ర కంగారుకు లోనై గుండెపోటు వచ్చి టబ్‌లో నుంచి పైకి లేవలేక, ఊపిరి ఆడక ఆమె తుది శ్వాస విడిచారు. అయితే, ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఆమె భర్త బోనీ కపూర్ హోటల్ గదికి వచ్చారు. ఎంత కొట్టి చూసినా శ్రీదేవి బాత్ రూం తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, కాపేసట్లో ప్రత్యేక జెట్ విమానంలో ఆమె మృతదేహాన్ని తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment