శ్రీదేవి (ఫైల్ ఫొటో)
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై ఫోరెన్సిక్ నివేదిక అందింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రం దుబాయ్ పోలీసులకు అందింది. శ్రీదేవి మరణం వెనక ఎలాంటి కుట్ర లేదనివారు స్పష్టం చేశారు. మరోవైపు ఇమిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
గల్ఫ్‌లో వాసుదేవరావ్ అనే ఓ జర్నలిస్టు తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా ఓ వ్యక్తి ఆస్పత్రిలోనే చనిపోతే అందుకు గల కారణాలు ముందే రికార్డెడ్‌గా ఉండి తదుపరి జరగాల్సిన కార్యక్రమాలు వేగంగా ఉంటాయని, కానీ, ఆస్పత్రి వెలుపల సాధారణంగానే చనిపోయినా కూడా చాలా ప్రొసీజర్ ఉంటుందని అన్నారు. ముందుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తారని తెలిపారు.
ఒక వేళ విదేశాలకు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పంపించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ ఆలస్యం అవుతుందని, ఎక్కువమంది అధికారులు ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందుగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి సంబంధించిన శవాలగదిలో ఉంచుతారని, ఆ తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి ఆ వెంటనే తిరిగి పోలీసులకు అప్పగిస్తారని అన్నారు. శవ పరీక్ష నివేదిక వచ్చిన మరణ ధృవీకరణ పత్రం ఇస్తారని, ఆ తర్వాతే పోలీసులు తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమయాల్లో పలు లేఖలను పోలీసులు ఇవ్వాల్సి ఉంటుందని, మరణ ధ్రువీకరణ పత్రం అరబిక్‌లో ఇస్తారని, భారత్ కాన్సులేట్‌కు మాత్రం దానికి అనువాదం చేసిన ఆంగ్ల ప్రతిని ఇస్తారని, అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి సదరు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని అన్నారు. ఇప్పుడు శ్రీదేవి పార్థీవ దేహం విషయంలో కూడా పైన పేర్కొన్న ప్రొసీజర్ జరుగుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment