శ్రీదేవి, బోనీ కపూర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆమె గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్‌పై దుబాయ్ పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసును పోలీసులు పునర్విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
నేడు మరోసారి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ పూర్తయ్యేవరకు దుబాయ్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. బోనీని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్ కాల్‌డేటాను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి ఒకరికి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు.
పెళ్లి ఈ నెల 20న జరిగితే శ్రీదేవి 24వరకు దుబాయ్‌లోనే ఎందుకున్నారు. ముంబై తిరొగొచ్చిన బోనీ మళ్లీ అక్కడికి ఎందుకు వెళ్లారు. టబ్‌లో పడ్డ ఆమెను ఎవరు చూశారు. ఆ సమయంలో బోనీ ఎక్కడున్నారనే ?అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమె భౌతిక కాయం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆమె భౌతిక కాయం వచ్చే అవకాశం కనిపించడంలేదు. అన్ని సందేహాలు తీరాకే ఆమె భౌతికకాయం అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీదేవి మరణంపై బోనీకపూర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment