ఈ కథ సూపర్బ్!
‘‘విజయ్‌కుమార్ కొండా చెప్పిన కథ సూపర్బ్. ప్రేమకథలోనే ఇది ఓ వినూత్న ప్రయత్నం అవుతుంది’’ అని నాగచైతన్య అన్నారు. ‘గుండెజారి గల్లంతయ్యింది’ ఫేం విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకునిగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి బేబి సాగరి కెమెరా స్విచాన్ చేయగా, బేబి సత్య క్లాప్ ఇచ్చారు. అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు చెప్పారు.
తొలి షెడ్యూలు ఈ నెల 23 వరకూ జరుగుతుందని, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీ షెడ్యూల్స్ చేసి ఏప్రిల్‌లో షూటింగ్ పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయిబాబా అన్నారు. మిస్ ఇండియా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ప్రభు, నాజర్, ఆశిష్‌విద్యార్థి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: ప్రవీణ్ పూడి, కళ: పీఎస్ వర్మ, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ; నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్.