'రాజు గాడు'తో రాజుగారు | Raj Tarun Next movie with anish krishna in dil raju Banner | Sakshi
Sakshi News home page

'రాజు గాడు'తో రాజుగారు

Published Sun, Oct 22 2017 11:15 AM | Last Updated on Sun, Oct 22 2017 11:15 AM

Raj Tarun Next movie with anish krishna in dil raju Banner

టాలీవుడ్ చాలా రోజులుగా వినిపిస్తున్న ఓ ప్రాజెక్ట్ ఫైనల్ గా సెట్స్ మీదకు రానుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. శతమానంభవతి సినిమాలో కూడా రాజ్ తరుణే హీరోగా నటించాల్సి ఉన్నా అప్పట్లో డేట్స్ కుదరకపోవటంతో శర్వానంద్ చేతికి వెళ్లింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ కాంబినేషన్ పై వార్తలు వినిపించాయి.

ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమవుతోంది. అక్టోబర్ 24 మంగళవారం రోజున ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్, త్వరలో సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగాడు సినిమాతో మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement