
రాజ్ తరుణ్
ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తనదైన కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతున్నాడు. కుమారి 21ఎఫ్ లాంటి ఘనవిజయాలు సాధించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. తన ఇమేజ్ తగ్గట్టుగా త్వరలో లవర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యువ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా లవర్.
రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా రిద్ధి కపూర్ పరిచయం అవుతోంది. ప్రస్తుతం లవర్ తో పాటు రాజుగాడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు రాజ్ తరుణ్. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment