Anish Krishna
-
Shirley Setia: తెలుగు సినిమాలో కివీస్ బ్యూటీ.. డబ్బింగ్ కూడా తానే..!
టాలీవుడ్లో కథానాయికలు కొత్తగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. సాధారణంగా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచి ఎక్కువగా తెలుగు తెరకు పరిచయమవుతుంటారు. ఎక్కువశాతం కోలీవుడ్ నుంచే టాలీవుడ్‌కు రావడం సహజం. కానీ నాగశౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా విదేశీ భామనే తెరకు పరిచయం చేశారు దర్శక, నిర్మాతలు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ సింగర్ షిర్లీ సెథియా ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటించారు. (చదవండి: హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య) నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి'. సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల పలకరించనుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే విదేశీ నటి షిర్లీ సెథియాను అనీష్ కృష్ణ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్ భామలే తెలుగు మాట్లాడటం చాలా అరుదు. కానీ ఈ కివీస్ భామ హిందీ రాకపోయినా సినిమా కోసం తెలుగు నేర్చుకుంది. అంతే కాదండోయ్ తన పాత్రకు తానే డబ్బింగ్‌తో పాటు డైలాగ్స్‌తో అదరగొట్టింది. ఏది ఏమైనా విదేశీ నటి తెలుగు నేర్చుకుని సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు అనీష్ కృష్ణ ప్రశంసించారు. -
నవ్వించడానికి రెడీ
నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్ కృష్ణ. ‘‘డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సినిమా షురూ
నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. శుక్రవారం ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీగా ఉంటుంది. నాగశౌర్య సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఛలో’కు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: బుజ్జి. -
డ్రీమ్ గాళ్‌తో రానా!
ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్ వరకూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ రానా. ప్రాంతీయ హద్దులను తన స్టోరీ సెలక్షన్స్‌తో చెరిపేస్తున్నారు. యాక్టర్‌గా కొత్త కొత్త కథలను చెబుతున్న రానా నిర్మాతగా మారి మరిన్ని కథలను స్క్రీన్ మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆల్రెడీ సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన కొన్ని సినిమాలకు రానా సమర్పకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతలా మారి, రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ జరుగుతోందని తెలిసింది. ఇది హిందీ ‘డ్రీమ్ గాళ్’ చిత్రానికి రీమేక్ అని కూడా సమాచారం. -
‘లవర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లవర్ జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, రాజీవ్ కనకాల, శరత్ కేడ్కర్, అజయ్ సంగీతం : సాయి కార్తీక్, అంకిత్ తివారి, అర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్, అజయ్ వాస్, తనిష్క్ బాగ్చీ దర్శకత్వం : అనీష్ కృష్ణ నిర్మాత : దిల్ రాజు కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్ లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రాజ్ తరుణ్ తాజాగా లవర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా అనీష్ కృష్ణ దర్శకుడు. ట్రైలర్ తో రాజ్ తరుణ్‌ను యాక్షన్ హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేసిన మేకర్స్... లవర్‌తో రాజ్ తరుణ్ కమర్షియల్ హీరోగా నిలబెట్టారా...? వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న ఈ యంగ్ హీరో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..? కథ; రాజు (రాజ్ తరుణ్) అనాథ. అనంతపురంలో కస్టమైజ్డ్ మోటర్ బైక్ బిల్డర్‌గా పనిచేస్తుంటాడు. జగ్గు (రాజీవ్ కనకాల)ను తన సొంత అన్న గా భావించి వారి కుటుంబానికి చేదుడు వాదోడుగా ఉంటుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రాజుకు ఓ గొడవ కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసే చరిత (రిద్ధి కుమార్) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. (సాక్షి రివ్యూస్) హాస్పిటల్ లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించి మాట్లాడే చరిత, లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ప్రభుత్వాన్నే గడగడలాండిచే వరదరాజులు (శరత్ కేడ్కర్)కు లక్ష్మీకి సంబంధం ఏంటి..? లక్ష్మీ, చరితలను రాజు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు లవర్ బాయ్ ఇమేజ్ తో ఆకట్టుకున్న రాజ్ తరుణ్.. లవర్ సినిమాతో మాస్ కమర్షియల్ హీరోగా కనిపించే ప్రయత్నం చేశాడు. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడ్డాడు. హీరోయిన్ రిద్ధి కుమార్‌కు తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తెర మీద అందంగా కనిపించారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చరిత పాత్రలో రిద్ధి కుమార్ మంచి నటన కనబరిచారు. రాజీవ్ కనకాల నటన సినిమాకు ప్లస్ అయ్యింది.(సాక్షి రివ్యూస్) చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించిన రాజీవ్ తనదైన ఎమోషనల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. విలన్స్ గా అజయ్, సుబ్బరాజులు రొటీన్ పాత్రల్లో కనిపించారు. మెయిన్ విలన్‌గా నటించిన శరత్ కేడ్కర్‌ది అతిధి పాత్రే. ఆయన తెర మీద కనిపించేది కేవలం రెండు మూడు సీన్స్‌లోనే. హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్, ప్రవీణ్, సత్య , రాజాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడిగా సినమా చేసిన అనీష్ కృష్ణ రొటీన్ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడక్కడా కాస్త కొత్తదనం కనిపించినా ఎక్కువ భాగం రొటీన్ ప్రేమకథలాగే సాగింది. ఫస్ట్ హాప్ ను కామెడీ, లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు అసలు కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా లేదు. ప్రీ క్లైమాక్స్ వరుకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. కార్‌ను హ్యాక్ చేయటం లాంటి అంశాలు ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్)సంగీతం బాగుంది. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేయటం కొత్త ప్రయోగమనే చెప్పాలి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ కు మందు వచ్చే యాక్షన్ సీన్‌తో పాటు కేరళలో జరిగే సీన్స్ లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; హీరో హీరోయిన్ల నటన సినిమాటోగ్రఫి సాంగ్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనాలు ఫస్ట్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘లవర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తనదైన కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతున్నాడు. కుమారి 21ఎఫ్ లాంటి ఘనవిజయాలు సాధించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. తన ఇమేజ్ తగ్గట్టుగా త్వరలో లవర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యువ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా లవర్. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా రిద్ధి కపూర్ పరిచయం అవుతోంది. ప్రస్తుతం లవర్ తో పాటు రాజుగాడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రాజ్ తరుణ్. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాజ్ తరుణ్ 'లవర్'
చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న దిల్ రాజు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ ఫైనల్ గా సెట్స్ మీదకు వచ్చింది. గతంలో శతమానంభవతి సినిమాలో రాజ్ తరుణే హీరోగా నటించాల్సి ఉన్నా అప్పట్లో డేట్స్ కుదరకపోవటంతో శర్వానంద్ చేతికి వెళ్లింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ కాంబినేషన్ పై వార్తలు వినిపించాయి. ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమయ్యింది. ఈ రోజు ( అక్టోబర్ 24 మంగళవారం) ఉదయం లాంచనంగా ప్రారంభించారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తొలిషాట్ కు క్లాప్ కొట్టగా హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లవర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'రాజు గాడు'తో రాజుగారు
టాలీవుడ్ చాలా రోజులుగా వినిపిస్తున్న ఓ ప్రాజెక్ట్ ఫైనల్ గా సెట్స్ మీదకు రానుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. శతమానంభవతి సినిమాలో కూడా రాజ్ తరుణే హీరోగా నటించాల్సి ఉన్నా అప్పట్లో డేట్స్ కుదరకపోవటంతో శర్వానంద్ చేతికి వెళ్లింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ కాంబినేషన్ పై వార్తలు వినిపించాయి. ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమవుతోంది. అక్టోబర్ 24 మంగళవారం రోజున ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్, త్వరలో సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగాడు సినిమాతో మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. -
మేడ మీద లవ్ జర్నీ!
ఆన్ లొకేషన్ మేడ మీదకి చదువుకోవడానికో లేక చల్లగాలికో వెళుతుంటారు. అయితే అల్లరోడిలా మంచి వయసులో ఉన్న కుర్రోళ్లు మాత్రం మేడ మీదకు వెళ్లారంటే... అదే పనిగా అక్కడే ఉన్నారంటే కారణం వేరే ఉంటుంది. అదేంటో గ్రహించే ఉంటారు. ‘పిల్ల గాలి’ కోసం అన్నమాట. అల్లరోడు ఆ పిల్లని ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ చూశాడు? మేడ మీద మకాం వేసిన అల్లరోడి లైఫ్ యాంబిషన్ ఏంటి? మనోడి మేడ మీద లవ్ జర్నీ ఎలా సాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ‘మేడ మీద అబ్బాయి’. ‘అల్లరి’ నరేశ్ హీరోగా శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై అనీష్ కృష్ణ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నటుడు కృష్ణభగవాన్ కథ–మాటలు అందించారు. డీజే వసంత్ స్వరకర్త. ఇటీవల పొలాచ్చిలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. -
కామెడీ థ్రిల్లర్‌లో అల్లరి
‘అల్లరి’ నరేశ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ ఓ చిత్రం నిర్మించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్ ఇది. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ - ‘‘కామెడీ, హ్యూమన్ ఎమోషన్స్‌తో పాటు యూత్ మెచ్చే అంశాలున్న కథ ఇది. మంచి కామెడీ థ్రిల్లర్. ‘గమ్యం’ తర్వాత నరేశ్ నటించబోతున్న వైవిధ్యమైన కమర్షియల్ చిత్రమిది. నరేశ్ పేరు వింటేనే తెరపై ఆయన చేసే అల్లరి గుర్తొస్తుంది. ‘అలా ఎలా?’తో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు అనీష్ కృష్ణ. వీళ్లిద్దరి కలయికలో మంచి కథతో రూపొందించనున్న ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సాయి శ్రీరామ్, సంగీతం: డీజే వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ. -
దీనికి సీక్వెల్ చేస్తాం!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, శానీ సోలోమన్, ఖుషి, హెబ్బా పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘అందాల రాక్షసి’ తర్వాత తనకు అంత మంచి పేరు తెచ్చిన సినిమా ఇదేనని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇదే టీమ్‌తో ఈ సినిమాకుసీక్వెల్ చేయాలనుకుంటున్నామనీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో షూటింగ్ మొదలుపెడతామనీ దర్శకుడు చెప్పారు. చిత్ర బృందంలో పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.