నవ్వించడానికి రెడీ | Naga Shourya New Movie Launch By Nara Rohith | Sakshi
Sakshi News home page

నవ్వించడానికి రెడీ

Published Thu, Oct 29 2020 2:46 AM | Last Updated on Thu, Oct 29 2020 2:46 AM

Naga Shourya New Movie Launch By Nara Rohith - Sakshi

నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్‌ అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, డైరెక్టర్‌ కొరటాల శివ క్లాప్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ  స్క్రిప్ట్‌ను అనీష్‌ కృష్ణకు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్‌ కృష్ణ. ‘‘డిసెంబర్‌ మొదటి వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్‌ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్‌ సాయిశ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement