P Mahender Reddy
-
నవ్వించడానికి రెడీ
నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్ కృష్ణ. ‘‘డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
19 మార్కెట్ కమిటీలకు రూ.50 కోట్ల నిధులు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మార్కెట్ కమిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నార్సింగ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 19 మార్కెట్‌కమిటీలలో రూ. 50 కోట్ల నిధులతో వివిధ పనులను చేపట్టామన్నారు. నార్సింగ్ మార్కెట్ కమిటీకి సైతం రూ. 1.50 కోట్ల నిధులతో ఇప్పటికే పనులను కొనసాగిస్తున్నామన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రవీణ్‌కుమార్‌కు, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పుటం పురుషోత్తంరావును నియమిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం నార్సింగ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మంచర్ల మమత శ్రీనివాస్, వైస్ ఛైర్మన్‌గా బుద్దోలు శ్రీరాములు, 8మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. -
రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
హైదరాబాద్: బస్సు డ్యామేజి నష్టాన్ని డ్రైవర్లపై వేయడాన్ని నిరసిస్తూ తాండూరు బస్సు డిపో ఎదుట శుక్రవారం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సొంత ఇలాకా తాండురు బస్సు డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఆ విషయం తెలుసుకున్నమంత్రి మహేందర్‌రెడ్డి కార్మికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తాండూరు ఆర్టీసీ డీఎంను మంత్రి ఆదేశించారు. దాంతో తాండూరు ఆర్టీసీ డీఎం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చిస్తున్నారు. -
'ఆర్టీసీ విలీనంపై కేబినెట్లో చర్చిస్తా'
తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి మహీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో మహీందర్ రెడ్డి రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని బస్ డిపోలను ఆధునీకరిస్తామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తాని వెల్లడించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే బస్సు ఛార్జీలు తక్కువుగా ఉన్నాయి మహీందర్ రెడ్డి గుర్తు చేశారు. అయినా ఆర్టీసీ ఛార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ల కొత్తకోట మండలం పాలెం సమీపంలో గతేడాది వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయిందిని... ఆటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మహీందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.