19 మార్కెట్ కమిటీలకు రూ.50 కోట్ల నిధులు
Published Thu, Sep 8 2016 7:41 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మార్కెట్ కమిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నార్సింగ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 19 మార్కెట్‌కమిటీలలో రూ. 50 కోట్ల నిధులతో వివిధ పనులను చేపట్టామన్నారు. నార్సింగ్ మార్కెట్ కమిటీకి సైతం రూ. 1.50 కోట్ల నిధులతో ఇప్పటికే పనులను కొనసాగిస్తున్నామన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రవీణ్‌కుమార్‌కు, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పుటం పురుషోత్తంరావును నియమిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం నార్సింగ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా మంచర్ల మమత శ్రీనివాస్, వైస్ ఛైర్మన్గా బుద్దోలు శ్రీరాములు, 8మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
Advertisement
Advertisement