ఆనందంగా ఉంది | Shirley Setia to make Telugu film debut opposite Naga Shaurya | Sakshi
Sakshi News home page

ఆనందంగా ఉంది

Published Sun, Nov 22 2020 5:53 AM | Last Updated on Sun, Nov 22 2020 5:53 AM

Shirley Setia to make Telugu film debut opposite Naga Shaurya - Sakshi

షిర్లీ సేతియా

ఇంటర్నెట్‌ను బాగా ఫాలో అయ్యేవాళ్లు షిర్లీ సేతియా పేరు వినే ఉంటారు. యూట్యూబ్‌ సెన్సేషన్‌ తను. న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్‌కి చెందిన ఈ భామ పేరున్న గాయని. ‘బాలీవుడ్‌కి కాబోయే సెన్సేషన్‌’ అని ఫోర్బ్స్‌ మేగజీన్‌ రాసింది. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘మస్కా’లో కనిపించారు షిర్లీ. అలానే ‘నికమ్మా’ అనే హిందీ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. నాగశౌర్య హీరోగా అనీష్‌ కష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో షిర్లీ సేతియాని కథానాయికగా ఎంపిక చేశారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు షిర్లీ. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సహనిర్మాత: బుజ్జి, కెమెరా: సాయి శ్రీరామ్, సమర్పణ: శంకర్‌ప్రసాద్‌ ముల్పూరి, సహనిర్మాత: బుజ్జి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement