టాలీవుడ్‌లో కథానాయికలు కొత్తగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. సాధారణంగా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచి ఎక్కువగా తెలుగు తెరకు పరిచయమవుతుంటారు. ఎక్కువశాతం కోలీవుడ్ నుంచే టాలీవుడ్‌కు రావడం సహజం. కానీ నాగశౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా విదేశీ భామనే తెరకు పరిచయం చేశారు దర్శక, నిర్మాతలు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ సింగర్ షిర్లీ సెథియా ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటించారు.
(చదవండి: హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య)
నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి'. సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల పలకరించనుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే విదేశీ నటి షిర్లీ సెథియాను అనీష్ కృష్ణ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్ భామలే తెలుగు మాట్లాడటం చాలా అరుదు. కానీ ఈ కివీస్ భామ హిందీ రాకపోయినా సినిమా కోసం తెలుగు నేర్చుకుంది. అంతే కాదండోయ్ తన పాత్రకు తానే డబ్బింగ్‌తో పాటు డైలాగ్స్‌తో అదరగొట్టింది. ఏది ఏమైనా విదేశీ నటి తెలుగు నేర్చుకుని సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు అనీష్ కృష్ణ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment