
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్‌గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment