
యంగ్ హీరో నాగశౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు చేయి చేసుకోగా, ఎందుకు కొట్టావంటూ నాగశౌర్య నిలదీశాడు. అంతేకాకుండా అమ్మాయిని కొట్టడం తప్పు అని ఆమెకు క్షమాపణలు(సారీ)చెప్పాల్సిందే అని శౌర్య సదరు యువకుడితో గొడవకు దిగాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అదే సమయంలో అట్నుంచి కారులో వెళుతున్న నాగశౌర్య ఇది గమనించి 'ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీశాడు.
దీనికి అతను ఆమె నా లవర్, నా ఇష్టం అంటూ ఓవర్‌యాక్షిన్ చేయగా అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ శౌర్య వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment