Krishna Vrinda Vihari
-
ఓటీటీకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి, ఆ రోజు నుంచి స్ట్రీమింగ్, ఎక్కడంటే
యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే దసరాకు ముందు దసరాకి ముందు థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు దీపావళి సందర్భంగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. చదవండి: సరోగసీ వివాదం.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన నయన్ దంపతులు! ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాలం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈమూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. కాగా దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికి.. కృష్ణ వ్రింద అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానుందంటూ నెట్ఫ్లిక్సలో ఆప్షన్ కనిపిస్తోంది. దీంతో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి థియేటర్ల నవ్వులు పూయించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. #PremiereAlert 🔔@IamNagashaurya's #KrishnaVrindaVihari will be available for streaming on @NetflixIndia from 23 October. pic.twitter.com/AtSoOIX31f — Unfiltered Filmy 🍿 (@UnfilteredFilmy) October 12, 2022 -
‘కృష్ణ వ్రింద విహారి’ సక్సెస్ మీట్.. నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘కృష్ణ వ్రింద విహారి’ చాలా మంచి సినిమా. థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా ఉన్నాం. మా సినిమాకి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లీ సేటియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇచ్చిన అనీష్ కృష్ణకు థ్యాంక్స్. ‘ఛలో’ తర్వాత నేను గర్వపడే హిట్ ఇచ్చినందు నిర్మాత, మా అమ్మకి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుత.. ‘‘కృష్ణ వ్రింద విహారి’ ఫ్యామిలీతో కలసి థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దసరా సెలవులు వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. రాధికగారితో పాటు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్. మా చిత్రాన్ని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనీష్ ఆర్.కృష్ణ. ఈ కార్యక్రమంలో నటీనటులు హిమజ, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ వ్రింద విహారి'
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం. అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లొ నటించారు. Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨ $100k+ US Gross in 2 Days! ❤️🔥 Watch our #HilariousBlockbuster In Cinemas now! 🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b — Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022 -
కృష్ణ వ్రింద విహారి మూవీ పబ్లిక్ టాక్
-
‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ
టైటిల్: కృష్ణ వ్రింద విహారి నటీనటులు: నాగశౌర్య, షిర్లే సేథియా , రాధిక, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్ నిర్మాత: ఉషా ముల్పూరి దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ విడుదల తేది: సెప్టెంబర్ 23,2022 ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. నిర్మాతగా మారి ‘ఛలో’చిత్రంతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన అశ్వథ్థామ మొదలు.. గతేడాదిలో విడుదలైన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ వరకు వరుసగా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు , పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌గా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్ 23)విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ(నాగశౌర్య)..పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సాంప్రదాయ బ్రాహ్మిణ్ యువకుడు. అతని తల్లి అమృతవల్లి(రాధిక) మాటని ఊరంతా గౌరవిస్తుంది. ఆమె ఏం చెప్పినా..అది కచ్చితంగా జరిగి తీరుతుందని గ్రామస్తుల నమ్మకం. కొడుకుని ఉద్యోగం రిత్యా హైదరాబాద్‌లో ఉన్న అల్లుడు (బ్రహ్మాజీ) ఇంటికి పంపిస్తుంది. అక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు కృష్ణ. అక్కడ వర్క్ చేసే నార్త్ అమ్మాయి వ్రిందా(షీర్లే సేథియా)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను మెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి..చివరకు ప్రేమలో పడేస్తాడు. వ్రిందాకు ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. దానిని దాచిపెట్టి, కుటుంబ సభ్యులకు ఓ అబద్దాన్ని చెప్పి వ్రిందాను పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. అసలు వ్రిందాకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? కుటుంబ సభ్యులతో కృష్ణ చెప్పిన అబద్దం ఏంటి? దాని వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? విభిన్నమైన అలవాట్లు ఉన్న కృష్ణ, వ్రిందాల వైవాహిక జీవితం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'కృష్ణ వ్రింద విహారి' క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ. ఈ చిత్రం కథ..ఇటీవల నాని నటించిన ‘అంటే సుందరానికీ’సినిమాను గుర్తు చేస్తుంది. ఆ సినిమాలో మాదిరే ఇందులో హీరో ఓ బ్రహ్మిణ్ కుర్రాడు. హీరో, హీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. అయితే కథనం మాత్రం వేరుగా ఉంటుంది. తెలిసిన కథే అయినప్పటికీ.. ప్రతి సీన్ చాలా ఫ్రెష్‌గా, కామెడీగా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చింది. సినిమా ప్రారంభంలోనే కృష్ణ ఫ్యామిలీ నేపథ్యం, వారు పాటించే సంప్రదాయలను చూపించిన దర్శకుడు... కాసేపటికే కథను హైదరాబాద్‌కు తరలించాడు. అక్కడ హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఆమెను మెప్పించడానికి హీరో నానా కష్టాలు పడడం..ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్ సాగుతుంది. ఫస్టాఫ్‌లో కొంతమేర కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. కానీ సెకండాఫ్‌లో మాత్రం వినోదాన్ని బాగా పండించాడు. కృష్ణ, వ్రిందాల పెళ్లి తర్వాత వచ్చే సన్నీవేశాలు, అత్త, కోడళ్ల మధ్య జరిగే పంచాయితీ నవ్వులు పూయిస్తుంది. తల్లి, పెళ్ళాం మధ్య హీరో నలిగే సన్నివేశాలకు కొత్తగా పెళ్లైన భర్తలు కనెక్ట్ అవుతారు. అలాగే కోమాలోకి వెళ్లిన వెన్నెల కిషోర్‌తో సత్య, రాహుల్ రామకృష్ణ, నాగశౌర్య కలిసే చేసే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీతో ప్రేక్షకులను కొంతమేర ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రలో నాగ శౌర్య మెప్పించాడు. ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిణ్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా,అత్తా కోడళ్ల మధ్య నలిగే భర్తగా.. ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. వ్రిందా పాత్రకి షిర్లే సేథియా న్యాయం చేసింది. ఆమెకిది తొలి తెలుగు సినిమా. తెరపై అందంగా కనిపించింది. బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో నాన్నగా జయప్రకాశ్, నాన్నమ్మగా అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మహతి స్వరసాగర్ పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. నాగ శౌర్య, షెర్లీని చక్కగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పుడు పాన్ వరల్డ్ సినిమా అవుతుంది: నాగశౌర్య
‘‘పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి కథ కుదరాలి.. అంతేకానీ మనం పాన్ ఇండియాకి ప్లాన్ చేయకూడదు. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే పాన్ వరల్డ్ చూస్తారు. అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్‌గా ఉన్న సమయంలో మేము ఉండటం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు నాగశౌర్య. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. ⇔ ‘కృష్ణ వ్రింద విహారి’ కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో అనీష్‌కి ఓకే చెప్పాను. మంచి ఫన్, ఫ్యామిలీ, మాస్.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. సినిమా చూసినవారు తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. కుటుంబం ఉన్నంతవరకూ మా ‘కృష్ణ వ్రింద విహారి’లాంటి కథలకు తిరుగులేదు. ఈ సినిమాలో రాధికగారి పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ హిలేరియస్‌గా ఉంటాయి. ⇔ ‘అదుర్స్, డీజే, అంటే సుందరానికీ’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు ఉన్నప్పటికీ దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ. కమల్‌హాసన్, ఎనీ్టఆర్, అల్లు అర్జున్‌గార్లు.. వంటి వారు బ్రహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు స్వతహాగా బ్రాహ్మణుడైన అవసరాల శ్రీనివాస్ వద్ద కొన్ని విషయాలు నేర్చుకున్నాను. రొమాంటిక్ సీన్స్‌లో నేను చాలా వీక్ (నవ్వుతూ).. మా దర్శకుడు కష్టపడి చేయించారు. ⇔ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన పాద యాత్రలో ప్రేక్షకుల అభిమానం ఒక వరం అనిపించింది. ఇక నేను నటించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్ పూర్తయింది.. త్వరలో విడుదల చేస్తాం. -
ట్రైలర్ చాలా నచ్చింది
‘‘కృష్ణ వ్రింద విహారి’ రెండున్నరేళ్ల ప్రయాణం. కోవిడ్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాతలైన మా అమ్మానాన్న ధైర్యంగా నిలబడి సినిమాని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఇలాంటి అమ్మానాన్నకు కొడుకుని కావడం నా అదృష్టం’’ అని నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంది. ఈ సినిమా శౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అనీష్ కృష్ణ నాకో మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది.. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటా.. మీ (ప్రేక్షకుల) నమ్మకం పోగొట్టుకోను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని నాగశౌర్యగారు బలంగా నమ్మారు కాబట్టే పాదయాత్ర చేశారు’’ అన్నారు అనీష్ ఆర్. కృష్ణ. -
Shirley Setia: తెలుగు సినిమాలో కివీస్ బ్యూటీ.. డబ్బింగ్ కూడా తానే..!
టాలీవుడ్లో కథానాయికలు కొత్తగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. సాధారణంగా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచి ఎక్కువగా తెలుగు తెరకు పరిచయమవుతుంటారు. ఎక్కువశాతం కోలీవుడ్ నుంచే టాలీవుడ్‌కు రావడం సహజం. కానీ నాగశౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా విదేశీ భామనే తెరకు పరిచయం చేశారు దర్శక, నిర్మాతలు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ సింగర్ షిర్లీ సెథియా ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటించారు. (చదవండి: హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య) నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి'. సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల పలకరించనుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే విదేశీ నటి షిర్లీ సెథియాను అనీష్ కృష్ణ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్ భామలే తెలుగు మాట్లాడటం చాలా అరుదు. కానీ ఈ కివీస్ భామ హిందీ రాకపోయినా సినిమా కోసం తెలుగు నేర్చుకుంది. అంతే కాదండోయ్ తన పాత్రకు తానే డబ్బింగ్‌తో పాటు డైలాగ్స్‌తో అదరగొట్టింది. ఏది ఏమైనా విదేశీ నటి తెలుగు నేర్చుకుని సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు అనీష్ కృష్ణ ప్రశంసించారు. -
హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 23న విడుదల కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. రెండేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు వచ్చినా థియేటర్లలోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. చాలామంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సినమాలు చేస్తున్నా అనుకుంటారు..కానీ హీరో అయ్యాకే నేను కారు, ఇల్లు కొనుక్కున్నా. కష్టపడితే ఎవరైనా తమ కలలు నిజం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. -
‘కృష్ణా వ్రిందా విహారి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘నా ఫ్రెండ్ లైఫ్‌లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ‘కృష్ణా వ్రిందా విహారి’ తీశా’
‘‘నాకు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేదు. నా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాను నా స్నేహితుడే నిర్మించడంతో సులభంగానే దర్శకుడిని అయ్యాను. ఈ ఎనిమిదేళ్లలో మూడు సినిమాలు తీశాను. ఈ అనుభవంతో చాలా నేర్చుకున్నాను. ఇకపై పక్కా ప్రణాళికతో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు అనీష్ ఆర్. కృష్ణ. నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణా వ్రిందా విహారి’. శంకర్ ప్రసాద్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు అనీష్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడు కృష్ణ పాత్ర చేశారు. శౌర్యలో ఒక రకమైన అమాయకత్వం, అల్లరి, కొంటెతనం ఉన్నాయి. అందుకే కృష్ణ పాత్రకు సరిపోయారు. కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం. బయటకు సరదాగా, చలాకీగా కనిపిస్తున్నా అంతర్లీనంగా ఆమెకో సమస్య ఉంటుంది. ఈ సమస్యే కథను ముందుకు నడిపిస్తుంటుంది. అది వెండితెరపైనే చూడాలి’’ అన్నారు. -
తిరుపతిలో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రబృందం హీరో నాగ శౌర్య పాదయాత్ర (ఫొటోలు)
-
అందుకే నాగశౌర్య సినిమాకి ‘కృష్ణ వ్రిందా విహారి’ టైటిల్ పెట్టాం : నిర్మాత
‘నేను ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో రాలేదు. అనుకోకుండా రావాల్సివచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉన్నాను కాబట్టే వేరే హీరోలను అప్రోచ్ అవ్వలేదు. కానీ ‘కృష్ణ వ్రింద విహారి' తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను’అన్నారు హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉషా మూల్పూరి. నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర నిర్మాత ఉషా మూల్పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం. ►ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. ఆయన కెరీర్లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ►ఈ చిత్రంలో 200 మంది డ్యాన్సర్‌తో కలిసి చేసిన పాటకు మంచి స్పందన లభించింది. సినిమాలో ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. ►టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం ఉంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం. ►ఈ సినిమా చేస్తున్నపుడు నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి లేదు. అద్భుతమైన కథ. ఆ కథకు తగ్గట్టు నటీనటులు, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం ఉంది. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శౌర్య అద్భుతంగా చేశాడు. రాధిక, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, రాహుల్ రామకృష్ణ, సత్య అందరి పాత్రలు బావుంటాయి. దర్శకుడు అనీష్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా డీల్ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎవరినీ నిరాశ పరచదు. మా బ్యానర్ ఇది చాలా మంచి చిత్రమౌతుంది. ► ఇప్పటికే కొన్ని కథలు విన్నాం. అయితే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. నిండు గర్భిణి బిడ్డని కన్న తర్వాతే మరో బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ చిత్రం విడుదలపైనే ఉంది. -
నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. వచ్చేది అప్పుడే
Krishna Vrinda Vihari Movie New Release Date Announced: యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఏదో ఆలోచిస్తూ సూపర్ కూల్‌గా ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి Coming to you as Krishna with lots of love & laugh. May 20th - Get Set for Summer treat people🥳#KrishnaVrindaVihari on May 20th🎋 #KVV @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth #KrishnaVrindaVihariOnMay20 pic.twitter.com/z7CGOV7P0G — Naga Shaurya (@IamNagashaurya) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1151264010.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సామ్ చేతుల మీదుగా ‘వెన్నెల్లో వర్షంలా..’ రొమాంటిక్ సాంగ్
యంగ్ హీరో నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన రొమాంటికి అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ని స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్’అంటూ ట్వీట్ చేస్తూ సామ్ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ని ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్ అద్భుత సంగీతాన్ని అందించాడు. -
‘కృష్ణ వ్రిందా విహారి’ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎప్పుడంటే
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఏప్రిల్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.“వర్షంలో వెన్నెల్లా” అనే సాంగ్‌ని ఏప్రిల్9న విడుదల చేయనున్నట్లు మూవీ టీం పేర్కొంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. This will amaze you all .. 🎵 Our First Single #VarshamloVennella Lyrical Video is releasing on April 9th! 💕😊#KrishnaVrindaVihari@ShirleySetia #AnishKrishna @mahathi_sagar #SaiSriram @ira_creations @saregamasouth pic.twitter.com/oA95qm79nM — Naga Shaurya (@IamNagashaurya) April 7, 2022 -
‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్ వచ్చేస్తుంది
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మార్చి 28న టీజర్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ని వదిలింది చిత్రబృందం. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించారు. ఈ చిత్రిం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 28న విడుదల చేసే టీజర్ తప్పకుండా అందరికి నచ్చుంది’అని చిత్ర యూనిట్ పేర్కొంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.