![Naga Sharya Speech At Krishna Vrinda Vihari Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/21/naga.jpg.webp?itok=ASSu6365)
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్‌గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 23న విడుదల కానుంది.
ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. రెండేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు వచ్చినా థియేటర్లలోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. చాలామంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సినమాలు చేస్తున్నా అనుకుంటారు..కానీ హీరో అయ్యాకే నేను కారు, ఇల్లు కొనుక్కున్నా. కష్టపడితే ఎవరైనా తమ కలలు నిజం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment