పెళ్లయ్యాక నాగశౌర్య వేరేకాపురం పెట్టాడు: హీరో తల్లి | Naga Shaurya Mother Usha Prasad React To Her Son Separate Family After Marriage | Sakshi
Sakshi News home page

Naga Shaurya: పెళ్లవగానే నాగశౌర్య వేరే కాపురం పెట్టాడు.. ఆమెను కూతురిగా..

Published Fri, Dec 29 2023 4:43 PM | Last Updated on Fri, Dec 29 2023 4:56 PM

Naga Shaurya Mother Usha Prasad React To Her Son Separate Family After Marriage - Sakshi

టాలీవుడ్‌ హీరో నాగశౌర్య గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని ఆయన పెళ్లాడారు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే శౌర్య వేరు కాపురం పెట్టాడట! ఈ విషయాన్ని అతడి తల్లి బయటపెట్టింది.

కూతురిలా చూసుకుంటా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య తల్లి ఉషా ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'అనూష నాకు మూడేళ్ల క్రితమే తెలుసు. ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటాను. నన్ను మమ్మా అని పిలుస్తుంది. నా భర్తను డాడీ అని పిలుస్తుంది. తను చాలా మంచి అమ్మాయి. తనకు చాలా మెచ్యూరిటీ ఉంది. శౌర్య-అనూష మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. పెద్ద కోడలు అమెరికాలో సెటిలైంది. యాపిల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చిన్న కోడలు అనూష ఇంటీరియర్‌ డిజైనర్‌గా ఫుల్‌ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్న అన్ని పనులను బాగా చక్కబెట్టుకుంటుంది.

అది ఎప్పుడో అనుకున్నాం..
నాగశౌర్య-అనూష పెళ్లవగానే వేరే కాపురం పెట్టారు. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడనుకున్నది కాదు.. పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం.. ఇప్పుడున్న జనరేషన్‌కు ఎవరి స్వాతంత్య్రం వారికిస్తే బాగుంటుంది. ఇది మాకు మొదటి నుంచీ ఉన్న అభిప్రాయం.. అంతే! ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఉషా ప్రసాద్‌.. నిర్మాతగా నాగశౌర్యతో నాలుగు సినిమాలు చేసింది. ఇటీవల రెస్టారెంట్‌ బిజినెస్‌ సైతం ప్రారంభించింది.

చదవండి: విజయకాంత్‌ అంత్యక్రియలు.. విజయ్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement