Usha Mulpuri
-
పెళ్లయ్యాక నాగశౌర్య వేరేకాపురం పెట్టాడు: హీరో తల్లి
టాలీవుడ్ హీరో నాగశౌర్య గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన పెళ్లాడారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే శౌర్య వేరు కాపురం పెట్టాడట! ఈ విషయాన్ని అతడి తల్లి బయటపెట్టింది. కూతురిలా చూసుకుంటా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య తల్లి ఉషా ప్రసాద్ మాట్లాడుతూ.. 'అనూష నాకు మూడేళ్ల క్రితమే తెలుసు. ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటాను. నన్ను మమ్మా అని పిలుస్తుంది. నా భర్తను డాడీ అని పిలుస్తుంది. తను చాలా మంచి అమ్మాయి. తనకు చాలా మెచ్యూరిటీ ఉంది. శౌర్య-అనూష మేడ్ ఫర్ ఈచ్ అదర్. పెద్ద కోడలు అమెరికాలో సెటిలైంది. యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చిన్న కోడలు అనూష ఇంటీరియర్ డిజైనర్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్న అన్ని పనులను బాగా చక్కబెట్టుకుంటుంది. అది ఎప్పుడో అనుకున్నాం.. నాగశౌర్య-అనూష పెళ్లవగానే వేరే కాపురం పెట్టారు. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడనుకున్నది కాదు.. పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం.. ఇప్పుడున్న జనరేషన్‌కు ఎవరి స్వాతంత్య్రం వారికిస్తే బాగుంటుంది. ఇది మాకు మొదటి నుంచీ ఉన్న అభిప్రాయం.. అంతే! ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఉషా ప్రసాద్.. నిర్మాతగా నాగశౌర్యతో నాలుగు సినిమాలు చేసింది. ఇటీవల రెస్టారెంట్ బిజినెస్ సైతం ప్రారంభించింది. చదవండి: విజయకాంత్ అంత్యక్రియలు.. విజయ్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తి.. -
Shirley Setia: తెలుగు సినిమాలో కివీస్ బ్యూటీ.. డబ్బింగ్ కూడా తానే..!
టాలీవుడ్లో కథానాయికలు కొత్తగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. సాధారణంగా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచి ఎక్కువగా తెలుగు తెరకు పరిచయమవుతుంటారు. ఎక్కువశాతం కోలీవుడ్ నుంచే టాలీవుడ్‌కు రావడం సహజం. కానీ నాగశౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా విదేశీ భామనే తెరకు పరిచయం చేశారు దర్శక, నిర్మాతలు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ సింగర్ షిర్లీ సెథియా ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటించారు. (చదవండి: హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య) నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి'. సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల పలకరించనుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే విదేశీ నటి షిర్లీ సెథియాను అనీష్ కృష్ణ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్ భామలే తెలుగు మాట్లాడటం చాలా అరుదు. కానీ ఈ కివీస్ భామ హిందీ రాకపోయినా సినిమా కోసం తెలుగు నేర్చుకుంది. అంతే కాదండోయ్ తన పాత్రకు తానే డబ్బింగ్‌తో పాటు డైలాగ్స్‌తో అదరగొట్టింది. ఏది ఏమైనా విదేశీ నటి తెలుగు నేర్చుకుని సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు అనీష్ కృష్ణ ప్రశంసించారు. -
అందుకే నాగశౌర్య సినిమాకి ‘కృష్ణ వ్రిందా విహారి’ టైటిల్ పెట్టాం : నిర్మాత
‘నేను ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో రాలేదు. అనుకోకుండా రావాల్సివచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉన్నాను కాబట్టే వేరే హీరోలను అప్రోచ్ అవ్వలేదు. కానీ ‘కృష్ణ వ్రింద విహారి' తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను’అన్నారు హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉషా మూల్పూరి. నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర నిర్మాత ఉషా మూల్పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం. ►ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. ఆయన కెరీర్లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ►ఈ చిత్రంలో 200 మంది డ్యాన్సర్‌తో కలిసి చేసిన పాటకు మంచి స్పందన లభించింది. సినిమాలో ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. ►టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం ఉంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం. ►ఈ సినిమా చేస్తున్నపుడు నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి లేదు. అద్భుతమైన కథ. ఆ కథకు తగ్గట్టు నటీనటులు, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం ఉంది. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శౌర్య అద్భుతంగా చేశాడు. రాధిక, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, రాహుల్ రామకృష్ణ, సత్య అందరి పాత్రలు బావుంటాయి. దర్శకుడు అనీష్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా డీల్ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎవరినీ నిరాశ పరచదు. మా బ్యానర్ ఇది చాలా మంచి చిత్రమౌతుంది. ► ఇప్పటికే కొన్ని కథలు విన్నాం. అయితే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. నిండు గర్భిణి బిడ్డని కన్న తర్వాతే మరో బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ చిత్రం విడుదలపైనే ఉంది.