రాజ్ తరుణ్ 'లవర్' | Raj Tarun New movie Opening | Sakshi
Sakshi News home page

రాజ్ తరుణ్ 'లవర్'

Oct 24 2017 11:19 AM | Updated on Oct 24 2017 12:42 PM

Raj Tarun Lover opening

చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న దిల్ రాజు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ ఫైనల్ గా సెట్స్ మీదకు వచ్చింది. గతంలో శతమానంభవతి సినిమాలో రాజ్ తరుణే హీరోగా నటించాల్సి ఉన్నా అప్పట్లో డేట్స్ కుదరకపోవటంతో శర్వానంద్ చేతికి వెళ్లింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ కాంబినేషన్ పై వార్తలు వినిపించాయి.

ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమయ్యింది. ఈ రోజు ( అక్టోబర్ 24 మంగళవారం) ఉదయం లాంచనంగా ప్రారంభించారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తొలిషాట్ కు క్లాప్ కొట్టగా హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లవర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement