
రానా
ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్ వరకూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ రానా. ప్రాంతీయ హద్దులను తన స్టోరీ సెలక్షన్స్‌తో చెరిపేస్తున్నారు. యాక్టర్‌గా కొత్త కొత్త కథలను చెబుతున్న రానా నిర్మాతగా మారి మరిన్ని కథలను స్క్రీన్ మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆల్రెడీ సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన కొన్ని సినిమాలకు రానా సమర్పకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతలా మారి, రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ జరుగుతోందని తెలిసింది. ఇది హిందీ ‘డ్రీమ్ గాళ్’ చిత్రానికి రీమేక్ అని కూడా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment