Love Movie Review, in Telugu | ‘లవర్‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Fri, Jul 20 2018 12:32 PM | Last Updated on Fri, Jul 20 2018 1:13 PM

Lover Telugu Movie review - Sakshi

టైటిల్ : లవర్‌
జానర్ : రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రాజ్‌ తరుణ్‌, రిద్ధి కుమార్‌, రాజీవ్ కనకాల, శరత్‌ కేడ్కర్‌, అజయ్‌
సంగీతం : సాయి కార్తీక్‌, అంకిత్‌ తివారి, అర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్‌, అజయ్‌ వాస్‌, తనిష్క్ బాగ్చీ
దర్శకత్వం : అనీష్‌ కృష్ణ
నిర్మాత : దిల్‌ రాజు

కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్‌ తరుణ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌ లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. రొటీన్‌ సినిమాలతో బోర్‌ కొట్టించిన రాజ్‌ తరుణ్‌ తాజాగా లవర్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్‌ ఫుల్‌ నిర్మాత దిల్‌ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అనీష్‌ కృష్ణ దర్శకుడు. ట్రైలర్‌ తో రాజ్‌ తరుణ్‌ను యాక్షన్‌ హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేసిన మేకర్స్‌... లవర్‌తో రాజ్‌ తరుణ్‌ కమర్షియల్‌ హీరోగా నిలబెట్టారా...? వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న ఈ యంగ్ హీరో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడా..?

కథ;
రాజు (రాజ్‌ తరుణ్‌) అనాథ. అనంతపురంలో కస్టమైజ్డ్‌ మోటర్‌ బైక్‌ బిల్డర్‌గా పనిచేస్తుంటాడు. జగ్గు (రాజీవ్‌ కనకాల)ను తన సొంత అన్న గా భావించి వారి కుటుంబానికి చేదుడు వాదోడుగా ఉంటుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపిగా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న రాజుకు ఓ గొడవ కారణంగా గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే చరిత (రిద్ధి కుమార్‌) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. (సాక్షి రివ్యూస్‌) హాస్పిటల్‌ లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించి మాట్లాడే చరిత,  లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ప్రభుత్వాన్నే గడగడలాండిచే వరదరాజులు (శరత్‌ కేడ్కర్‌)కు లక్ష్మీకి సంబంధం ఏంటి..? లక్ష్మీ, చరితలను రాజు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ఇన్నాళ్లు లవర్‌ బాయ్ ఇమేజ్‌ తో ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్‌.. లవర్‌ సినిమాతో మాస్‌ కమర్షియల్ హీరోగా కనిపించే ప్రయత్నం చేశాడు. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడ్డాడు. హీరోయిన్ రిద్ధి కుమార్‌కు తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తెర మీద అందంగా కనిపిం‍చారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చరిత పాత్రలో రిద్ధి కుమార్ మంచి నటన కనబరిచారు. రాజీవ్‌ కనకాల నటన సినిమాకు ప్లస్ అయ్యింది.(సాక్షి రివ్యూస్‌) చాలా రోజుల తరువాత ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించిన రాజీవ్‌ తనదైన ఎమోషనల్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. విలన్స్‌ గా అజయ్‌, సుబ్బరాజులు రొటీన్‌ పాత్రల్లో కనిపించారు. మెయిన్‌ విలన్‌గా నటించిన శరత్‌ కేడ్కర్‌ది అతిధి పాత్రే. ఆయన తెర మీద కనిపించేది కేవలం రెండు మూడు సీన్స్‌లోనే. హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్‌, ప్రవీణ్‌, సత్య , రాజాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ ;
నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడిగా సినమా చేసిన అనీష్‌ కృష్ణ రొటీన్‌ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడక్కడా కాస్త కొత్తదనం కనిపించినా ఎక్కువ భాగం రొటీన్‌ ప్రేమకథలాగే సాగింది. ఫస్ట్‌ హాప్‌ ను కామెడీ, లవ్‌ స్టోరితో నడిపించిన దర్శకుడు అసలు కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌ కూడా ఆసక్తికరంగా లేదు. ప్రీ క్లైమాక్స్ వరుకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. కార్‌ను హ్యాక్ చేయటం లాంటి అంశాలు ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్‌)సంగీతం బాగుంది. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేయటం కొత్త ప్రయోగమనే చెప్పాలి. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి మరో ప్లస్‌ పాయింట్‌. ఇంటర్‌వెల్‌ కు మందు వచ్చే యాక్షన్‌ సీన్‌తో పాటు కేరళలో జరిగే సీన్స్‌ లో కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
హీరో హీరోయిన్ల నటన
సినిమాటోగ్రఫి
సాంగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
రొటీన్‌ కథా కథనాలు
ఫస్ట్‌ హాఫ్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement