కామెడీ థ్రిల్లర్‌లో అల్లరి | Allari Naresh's Next In Anish Krishna's Direction | Sakshi
Sakshi News home page

కామెడీ థ్రిల్లర్‌లో అల్లరి

Published Tue, Aug 30 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

కామెడీ థ్రిల్లర్‌లో అల్లరి

కామెడీ థ్రిల్లర్‌లో అల్లరి

‘అల్లరి’ నరేశ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ ఓ చిత్రం నిర్మించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్ ఇది. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ - ‘‘కామెడీ, హ్యూమన్ ఎమోషన్స్‌తో పాటు యూత్ మెచ్చే అంశాలున్న కథ ఇది.
 
 మంచి కామెడీ థ్రిల్లర్. ‘గమ్యం’ తర్వాత నరేశ్ నటించబోతున్న వైవిధ్యమైన కమర్షియల్ చిత్రమిది. నరేశ్ పేరు వింటేనే తెరపై ఆయన చేసే అల్లరి గుర్తొస్తుంది. ‘అలా ఎలా?’తో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు అనీష్ కృష్ణ. వీళ్లిద్దరి కలయికలో మంచి కథతో రూపొందించనున్న ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సాయి శ్రీరామ్, సంగీతం: డీజే వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement