టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన సినిమా 'బచ్చల మల్లి'(Bachalamalli Movie). గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా మెప్పించింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలో(OTT) సందడి చేస్తోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో(Amazon Prime Video) అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని థియేటర్లలో చూడడం మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు.
బచ్చలమల్లి అసలు కథేంటంటే..
ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు.
నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment