అనిల్ సుంకర, రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, సంజనా రెడ్డి
‘‘ఇప్పటి పరిస్థితుల్లో డైరెక్షన్ చాన్స్ రావడం చాలా అరుదు. నన్ను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాత అనిల్ సుంకరగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మా నాన్నగారు సినిమాలు చూసి 25 ఏళ్లవుతోంది. ‘రాజుగాడు’ సినిమాలోని రెండు సన్నివేశాలు ఆయనకి చూపించడంతో తెగ నవ్వుకున్నారు. అదే నా విజయంగా భావిస్తున్నా’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘భలే భలే మగాడివోయ్’ చూసి మారుతీగారిని మంచి కథ అడగ్గా ‘రాజుగాడు’ కథ ఇచ్చారు. ఆ కథను సంజనారెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. జూన్ 1 ఆమె జీవితంలో బిగ్గెస్ట్ డేగా నిలుస్తుంది. రాజ్ తరుణ్‌తో మళ్లీ మరో సినిమా ఎప్పుడు తీయాలా? అని ఆలోచిస్తున్నాను. మా సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో నేను నటించిన 5వ సినిమా ఇది. ఈ బ్యానర్‌లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. సంజనా ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి కామెడీ రాబట్టుకున్నారు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అమైరా దస్తూర్.
Comments
Please login to add a commentAdd a comment