‘రాజుగాడు’ మూవీ రివ్యూ | Rajugadu Telugu Movie Review | Sakshi
Sakshi News home page

Jun 1 2018 3:02 PM | Updated on Apr 8 2019 7:50 PM

Rajugadu Telugu Movie Review - Sakshi

టైటిల్ : రాజుగాడు
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రాజ్‌ తరుణ్‌, అమైరా దస్తుర్‌, రాజేంద్ర ప్రసాద్‌, నాగినీడు, రావూ రమేష్‌, సితార
సంగీతం : గోపి సుందర్‌
కథ : మారుతి
దర్శకత్వం : సంజన రెడ్డి
నిర్మాత : సుంకర రామబ్రహ్మం

కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్ తరువాత సక్సెస్‌లు సాధించటంలో కాస్త తడబడ్డాడు. అందుకే వేగం తగ్గించి ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా సంజన రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్‌ తరుణ్‌. మరి రాజ్‌ తరుణ్‌ చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? దర్శకురాలిగా సంజన రెడ్డి తొలి ప్రయత్నంలో విజయం సాధించారా..?

కథ ;
రాజు (రాజ్‌ తరుణ్‌) క్లెప్టోమేనియా అనే వితం వ్యాధితో బాధపడుతుంటాడు. తన ప్రమేయం లేకుండానే దొంగతనాలు చేసేలా ప్రేరేపించే ఈ వ్యాధి వల్ల చిన్నతనం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు. రాజుతో పాటు అతని తల్లిదండ్రులు (రాజేంద్ర ప్రసాద్‌, సితార) కూడా రాజు వ్యాధి కారణంగా చాలా ఇంబ్బందులు ఎదుర్కొంటారు. ఇన్ని కష్టాల మధ్య తన్వీ (అమైరా దస్తుర్‌)ని చూసిన రాజు తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం తన వ్యాధి గురించి దాచి పెట్టి ఆమెకు దగ్గరవుతాడు. (సాక్షి రివ్యూస్‌) తన్వీ ఫ్యామిలీకి కూడా రాజు నచ్చినా ఓ కండిషన్ పెడతారు. తన్వీ తాతయ్య సూర్య నారాయణ (నాగినీడు)కు రాజు నచ్చితేనే పెళ్లి అని, అందుకోసం ఓ పది రోజులు తాతగారి ఊరు రామాపురంలో ఉండాలని కండిషన్‌ పెడతారు. అలా రామపురం వెళ్లిన రాజు కుటుంబం ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొంది..? రాజు వ్యాధి కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? రాజును వెతుక్కుంటూ టెర్రరిస్టులు రామాపురం ఎందుకు వచ్చారు..? అన్నదే మిగత కథ.

నటీనటులు ;
రాజుగాడు పాత్రకు రాజ్‌ తరుణ్‌ సరిగ్గా సరిపోయాడు. అయితే గత చిత్రాలతోపోలిస్తే ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ నటన కాస్త డల్ గా అనిపిస్తుంది. లుక్స్‌పరంగా కూడా మెప్పించలేకపోయాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్‌ తో నవ్వించే ప్రయత్నం చేసిన ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. హీరోయిన్‌ అమైరా దస్తుర్‌ అందంగా కనిపించింది. అయితే పర్ఫామెన్స్‌ పరంగా ప్రూవ్ చేసుకునేంత స్కోప్‌ ఉన్న పాత్ర దక్కలేదు. హీరో తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ మరోసారి తనదైన నటన కనబరిచారు. (సాక్షి రివ్యూస్‌) ఇతర పాత్రల్లో నాగినీడు, రావూ రమేష్‌, సితార, సుబ్బరాజు తన పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ ;
భలేభలే మొగాడివోయ్‌, మహానుభావుడు సినిమాలతో విజయం సాధించిన మారుతి అదే తరహా కథను రాజుగాడు కోసం తయారు చేశాడు. వింత వ్యాధితో బాధపడుతున్న హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఎలా విజయం సాధించాడు అన్నదే కథ. అయితే ఈ పాయింట్‌ తెర మీద ఆకట్టుకునేలా చెప్పటంలో దర్శకురాలు సంజన సక్సెస్‌  కాలేకపోయారు. వినోదం పడించేందుకు చేసిన ప్రయత్నాలు ఆకట్టుకోలేదు. సెకం‍డ్‌ హాఫ్‌లో కథనం మరింత నెమ్మది సాగటం ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తుంది. (సాక్షి రివ్యూస్‌) కథలో లెక్కకు మించి ట్వీస్ట్‌లతో ఆడియన్స్‌ ను ఇబ్బంది పెట్టడం, రాజ్‌ తరుణ్‌ సినిమాలలో ఆశించే స్థాయి కామెడీ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. గోపిసుందర్‌ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌ :
మూల కథ
కొన్ని కామెడీ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్లో నేరేషన్‌
ఆశించిన స్థాయిలో వినోదం లేకపోవటం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement