RajuGadu
-
సూపర్ హిట్ రీమేక్‌లో రాజ్ తరుణ్
ఈ శుక్రవారం రాజుగాడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రాజ్ తరుణ్. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈసినిమా నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్ తరుణ్. కానీ నానుమ్ రౌడీ దాన్ అప్పట్లో నేను రౌడీనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమా రీమేక్‌తో రాజ్ తరుణ్ ఏమేరకు ఆకట్టుకోగలడో చూడాలి. గతంలో కాటమరాయుడు సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తెలుగులో వీరుడొక్కడేగా రిలీజ్ అయిన వీరం సినిమాను మళ్లీ కాటమరాయుడు పేరుతో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో పోలీస్‌గా రిలీజ్ అయిన తేరి సినిమాను కూడా రవితేజ హీరోగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
‘రాజుగాడు’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగాడు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, అమైరా దస్తుర్, రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, రావూ రమేష్, సితార సంగీతం : గోపి సుందర్ కథ : మారుతి దర్శకత్వం : సంజన రెడ్డి నిర్మాత : సుంకర రామబ్రహ్మం కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ తరువాత సక్సెస్‌లు సాధించటంలో కాస్త తడబడ్డాడు. అందుకే వేగం తగ్గించి ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా సంజన రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? దర్శకురాలిగా సంజన రెడ్డి తొలి ప్రయత్నంలో విజయం సాధించారా..? కథ ; రాజు (రాజ్ తరుణ్) క్లెప్టోమేనియా అనే వితం వ్యాధితో బాధపడుతుంటాడు. తన ప్రమేయం లేకుండానే దొంగతనాలు చేసేలా ప్రేరేపించే ఈ వ్యాధి వల్ల చిన్నతనం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు. రాజుతో పాటు అతని తల్లిదండ్రులు (రాజేంద్ర ప్రసాద్, సితార) కూడా రాజు వ్యాధి కారణంగా చాలా ఇంబ్బందులు ఎదుర్కొంటారు. ఇన్ని కష్టాల మధ్య తన్వీ (అమైరా దస్తుర్)ని చూసిన రాజు తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం తన వ్యాధి గురించి దాచి పెట్టి ఆమెకు దగ్గరవుతాడు. (సాక్షి రివ్యూస్) తన్వీ ఫ్యామిలీకి కూడా రాజు నచ్చినా ఓ కండిషన్ పెడతారు. తన్వీ తాతయ్య సూర్య నారాయణ (నాగినీడు)కు రాజు నచ్చితేనే పెళ్లి అని, అందుకోసం ఓ పది రోజులు తాతగారి ఊరు రామాపురంలో ఉండాలని కండిషన్ పెడతారు. అలా రామపురం వెళ్లిన రాజు కుటుంబం ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొంది..? రాజు వ్యాధి కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? రాజును వెతుక్కుంటూ టెర్రరిస్టులు రామాపురం ఎందుకు వచ్చారు..? అన్నదే మిగత కథ. నటీనటులు ; రాజుగాడు పాత్రకు రాజ్ తరుణ్ సరిగ్గా సరిపోయాడు. అయితే గత చిత్రాలతోపోలిస్తే ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటన కాస్త డల్ గా అనిపిస్తుంది. లుక్స్‌పరంగా కూడా మెప్పించలేకపోయాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేసిన ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. హీరోయిన్ అమైరా దస్తుర్ అందంగా కనిపించింది. అయితే పర్ఫామెన్స్ పరంగా ప్రూవ్ చేసుకునేంత స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు. హీరో తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మరోసారి తనదైన నటన కనబరిచారు. (సాక్షి రివ్యూస్) ఇతర పాత్రల్లో నాగినీడు, రావూ రమేష్, సితార, సుబ్బరాజు తన పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ; భలేభలే మొగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో విజయం సాధించిన మారుతి అదే తరహా కథను రాజుగాడు కోసం తయారు చేశాడు. వింత వ్యాధితో బాధపడుతున్న హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఎలా విజయం సాధించాడు అన్నదే కథ. అయితే ఈ పాయింట్ తెర మీద ఆకట్టుకునేలా చెప్పటంలో దర్శకురాలు సంజన సక్సెస్ కాలేకపోయారు. వినోదం పడించేందుకు చేసిన ప్రయత్నాలు ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్‌లో కథనం మరింత నెమ్మది సాగటం ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. (సాక్షి రివ్యూస్) కథలో లెక్కకు మించి ట్వీస్ట్‌లతో ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టడం, రాజ్ తరుణ్ సినిమాలలో ఆశించే స్థాయి కామెడీ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. గోపిసుందర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మూల కథ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ ఆశించిన స్థాయిలో వినోదం లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఇది నా గుడ్ టైమ్
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయిక అమైరా దస్తూర్ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితం నేను నటించిన ‘అనేగన్’ సినిమా చూసి దర్శకురాలు సంజన ఫోన్ చేశారు. సినిమాలో నటిస్తారా? అని అడిగారు. వాస్తవానికి తెలుగులో నాకు ‘రాజుగాడు’ తొలి చిత్రం కావాల్సింది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఇది నా రెండో సినిమాగా మారింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో హైదరాబాదీ అమ్మాయిలా, సెకండాఫ్‌లో విలేజ్ అమ్మాయిలా నటించాను. రాజ్ తరుణ్ నాకన్నా ఒక ఏడాదే పెద్ద. ఇద్దరి అభిరుచులు బాగా కలిశాయి. షూటింగ్లో ఉన్నా, బయట ఉన్నా రాజ్ ఒకేలా సరదాగా ఉంటాడు. దర్శకురాలు సంజన చాలా స్మార్ట్. ఆమెతో వర్క్ చేస్తే ఒక ఫ్యామిలీతో వర్క్ చేసినట్లు ఉంటుంది. సంజయ్‌లీలా భన్సాలీ నా ఫేవరెట్ డైరెక్టర్. ‘పద్మావత్’ లాంటి íపీరియాడికల్ సినిమాలో నటించాలన్నది నా డ్రీమ్’’ అన్నారు. ప్రస్తుతం అమైరా హిందీలో దేవకట్టా దర్శకత్వంలో ‘ప్రస్థానం’ రీమేక్, ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల గురించి ఆమె చెబుతూ– ‘‘ఈ ఏడాది నాకు చాలా లక్కీ. ఇద్దరు సౌత్ డైరెక్టర్స్‌తో హిందీ సినిమాలు చేస్తున్నాను. నిజంగా ఇది నాకు గుడ్ టైమ్. మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది’’ అన్నారు. -
అదే నా విజయంగా భావిస్తున్నా
‘‘ఇప్పటి పరిస్థితుల్లో డైరెక్షన్ చాన్స్ రావడం చాలా అరుదు. నన్ను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాత అనిల్ సుంకరగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మా నాన్నగారు సినిమాలు చూసి 25 ఏళ్లవుతోంది. ‘రాజుగాడు’ సినిమాలోని రెండు సన్నివేశాలు ఆయనకి చూపించడంతో తెగ నవ్వుకున్నారు. అదే నా విజయంగా భావిస్తున్నా’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘భలే భలే మగాడివోయ్’ చూసి మారుతీగారిని మంచి కథ అడగ్గా ‘రాజుగాడు’ కథ ఇచ్చారు. ఆ కథను సంజనారెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. జూన్ 1 ఆమె జీవితంలో బిగ్గెస్ట్ డేగా నిలుస్తుంది. రాజ్ తరుణ్‌తో మళ్లీ మరో సినిమా ఎప్పుడు తీయాలా? అని ఆలోచిస్తున్నాను. మా సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నేను నటించిన 5వ సినిమా ఇది. ఈ బ్యానర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. సంజనా ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి కామెడీ రాబట్టుకున్నారు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అమైరా దస్తూర్. -
స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్..సంజనారెడ్డి
టెక్కలి : ఆమె చదివిన చదువుకు, ఎంచుకున్న రంగానికి ఎటువంటి సంబంధం లేదు.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం స్వగ్రామం.. అక్కడి నుంచి సమీప పట్టణమైన టెక్కలిలో స్థిర నివాసం.. డిగ్రీ వరకు అక్కడే కొనసాగిన చదువు.. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ కోర్సు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానం చివరకు వెండితెర వరకు వెళ్లింది. కొంతకాలం టీవీ చానెళ్లలో జర్నలిస్టుగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ చివరకు మహిళా దర్శకుల జాబితాలో తనదైన స్థానం సంపాదించుకుని కళామతల్లి సాక్షిగా సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారామె.. ఆమె మరెవరో కాదు దుక్క సంజనా రెడ్డి. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ రాజ్ తరుణ్, పూజిత, అమైరా దస్తూర్ నటీనటులుగా, రాజేంద్రప్రసాద్, సితార ప్రధాన పాత్రధారులుగా సంజనారెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి తెరకెక్కిన రాజుగాడు సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విశేషాలు.. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో.. సినిమా రంగంలో రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో సంజనారెడ్డి దర్శకత్వం వైపు దృష్టి సారించింది. నటి అక్కినేని అమల ప్రోత్సాహంతో ఓ యాడ్ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. అనతి కాలంలోనే రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్నారు. కేవలం 42 రోజుల్లో సినిమాను పూర్తి చేసి చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో శభాష్ అనిపించుకున్నారు. జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ ఫిల్మ్ మేకర్ కావాలనే ఆశయం.. భవిష్యత్‌లో పురుషులతో సమానంగా సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ ఫిల్మ్ మేకర్ కావాలనే ఆశయం ఉందని సంజనారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎంచుకున్న సినిమా రంగంపై తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొన్నారు. సందేశాత్మక, కమర్షియల్ సినిమాలు తీయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు. కష్టపడే స్వభావంతో చేసే పనిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని సంజనారెడ్డి తెలిపారు. కుటుంబ నేపథ్యం.. ఇజ్జువరం గ్రామానికి చెందిన దుక్క తులసీరెడ్డి, అరవిందాక్షి దంపతుల పెద్ద కుమార్తె సంజనారెడ్డి పదో తరగతి వరకు టెక్కలి బాలి కోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత బీఎస్ అండ్ జేఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి కొంతకాలం టెక్కలి పరి సర ప్రాంతాల్లో ప్రైవేట్ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశారు. జీవి తంలో ఏదో సాధించాలనే తపనతో కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులను అభ్యసించి హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యో గం సాధించారు. అక్కడితో తృప్తి చెందక ఎలక్ట్రానిక్ మీడి యా వైపు దృష్టి సారించారు. ఓవైపు చానెళ్లలో పనిచేస్తూ కొన్ని ఇంగ్లీష్ పత్రికలకు కవర్ స్టోరీలు రాసే అలవాటు చేసుకున్నారు. ఈ కోవలో సినీ పరిశ్రమలో ప్రముఖులను కలిసే అవకాశం లభించింది. ఇదే సమయంలో నటుడు మోహన్‌బాబు కుటుంబంతో సంజనారెడ్డికు పరిచయం ఏర్పడింది. రామ్‌గోపాలవర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు, జయసుధ, మంచు విష్ణు ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన ‘రౌడీ’ సినిమా సెట్స్‌కు సంజనారెడ్డి అప్పుడప్పుడు వెళ్తుండేవారు. అప్పుడే ఫిల్మ్‌మేకింగ్ చేయాలనే ఆలోచన కలిగిం ది. ముంబై వెళ్లి కొద్ది రోజులు వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నెల రోజుల పాటు ఇతర దేశాల్లో సినిమా నిపుణులను కలిసి ఫిల్మ్ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్నారు. -
వర్మగారే నాకు స్ఫూర్తి
‘‘మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఐటీ కంపెనీలో కొన్ని రోజులు పని చేశా. జర్నలిస్ట్‌గా కూడా వర్క్ చేశాను. సినిమా రంగంపై ఆసక్తితో ఓ స్నేహితుడి ద్వారా రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘రౌడీ’ సినిమాకి సహాయ దర్శకురాలిగా చేశా. నేను డైరెక్టర్ కావడానికి ఆయనే స్ఫూర్తి’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, అమైరా దస్తూర్, పూజిత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంజనారెడ్డి మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా 25 వసంతాల సమయంలో అమలగారిని కలిశాను. ఆమె నన్ను ఓ యాడ్‌ను డైరెక్ట్ చేయమన్నారు. నేను చేసిన యాడ్ అందరికీ నచ్చడంతో నాలో నమ్మకం పెరిగింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న టైమ్‌లో రాజ్‌తరుణ్ పరిచయం అయ్యారు. ‘రాజుగాడు’ నిర్మాతల్ని ఆయనే పరిచయం చేశారు. ఈ చిత్రంలో హీరోకి క్లిప్టోమేనియా అనే డిజార్డర్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు వాళ్లకు తెలియకుండానే దొంగతనం చేస్తుంటారు. ఈ వ్యాధి వల్ల హీరో ఉద్యోగాలన్నీ కోల్పోతాడు. కొడుకు కోసం తండ్రి రాజేంద్ర ప్రసాద్ సూపర్‌మార్కెట్ నడుపుతుంటాడు. ఇద్దరి మధ్య కామెడీ చక్కగా ఉంటుంది. ఇంటర్వెల్, క్లయిమాక్స్ సినిమాటిక్‌గా ఉంటాయి. మిగతాదంతా పక్కింటి కథను తెరపై చూస్తున్నట్లు ఉంటుంది. సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ప్రతి సినిమా స్పెషలే
‘‘సినిమా రిజల్ట్‌ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలానే ఉంటాయి. ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆరాటపడను. మంచి చిత్రాలు చేయాలని ఆచితూచి స్క్రిప్ట్‌ను ఎంచుకుంటున్నాను. నేను చేసే ప్రతి సినిమా నాకు స్పెషలే. తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడే కెరీర్లో ముందుకు వెళ్లగలుగుతాం’’ అన్నారు రాజ్ తరుణ్. సంజనారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మాం సుంకర నిర్మించిన చిత్రం ‘రాజుగాడు’. నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేసిన ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయల సమావేశంలో హీరో రాజ్ తరుణ్ పలు విషయాలు ముచ్చటించారు. ► మహిళా దర్శకులతో వరుస చిత్రాలు చేయడానికి పెద్దగా కారణాలు లేవు. యాదృశ్చికంగా అలా కుదిరిందంతే. ‘రంగులరాట్నం’ సినిమా కంటే ముందే ‘రాజుగాడు’ ప్రారంభమైంది. ఈ ఏడాదికి సంక్రాంతికి ‘రాజుగాడు’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ‘రంగులరాట్నం’ లైన్లో ఉండటంతో కుదర్లేదు. మంచి డేట్ చూసుకుని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ► ఈ చిత్రంలో క్లిప్టోమేనియా అనే డిజార్డర్ వల్ల తెలియకుండానే దొంగతనం చేసే హీరో క్యారెక్టర్ చేశాను. ఇలా డిజార్డర్‌తో బాధపడే హీరో ఊహించని పరిస్థితులను ఫేస్ చేసి ఎలా బయటపడ్డాడన్నదే చిత్రం కథ. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ పంథాలో సాగుతుంది. ► డైరెక్టర్ అంటే డైరెక్టరే. అందులో లేడీ అయితే ఏంటీ? జెంట్ అయితే ఏంటీ? ఎవరైనా ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారన్నదే ముఖ్యం. డైరెక్షన్లో నేనూ ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. కానీ స్టోరీ డిస్కషన్స్‌లో మాత్రం పాల్గొంటాను. ► నేను హీరోగా నటిస్తున్న ‘లవర్’ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఆ నెక్ట్స్ సూర్యప్రతాప్గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే వశిష్ట అనే కొత్త అబ్బాయి దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాను.