ఇది నా గుడ్‌ టైమ్‌ | Raj Tarun And Amyra Dastur Interview | Sakshi
Sakshi News home page

ఇది నా గుడ్‌ టైమ్‌

Published Fri, Jun 1 2018 12:31 AM | Last Updated on Fri, Jun 1 2018 12:31 AM

Raj Tarun And Amyra Dastur Interview - Sakshi

రాజ్‌ తరుణ్, అమైరా దస్తూర్‌ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయిక అమైరా దస్తూర్‌ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితం నేను నటించిన ‘అనేగన్‌’  సినిమా చూసి దర్శకురాలు సంజన ఫోన్‌ చేశారు. సినిమాలో నటిస్తారా? అని అడిగారు. వాస్తవానికి తెలుగులో నాకు ‘రాజుగాడు’ తొలి చిత్రం కావాల్సింది. షూటింగ్‌ ఆలస్యం కావడం వల్ల ఇది నా రెండో సినిమాగా మారింది. ఈ సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో హైదరాబాదీ అమ్మాయిలా, సెకండాఫ్‌లో విలేజ్‌ అమ్మాయిలా నటించాను. రాజ్‌ తరుణ్‌ నాకన్నా ఒక ఏడాదే పెద్ద.

ఇద్దరి అభిరుచులు బాగా కలిశాయి. షూటింగ్‌లో ఉన్నా, బయట ఉన్నా రాజ్‌ ఒకేలా సరదాగా ఉంటాడు. దర్శకురాలు సంజన చాలా స్మార్ట్‌. ఆమెతో వర్క్‌ చేస్తే ఒక ఫ్యామిలీతో వర్క్‌ చేసినట్లు ఉంటుంది. సంజయ్‌లీలా భన్సాలీ నా ఫేవరెట్‌ డైరెక్టర్‌. ‘పద్మావత్‌’ లాంటి íపీరియాడికల్‌ సినిమాలో నటించాలన్నది నా డ్రీమ్‌’’ అన్నారు. ప్రస్తుతం అమైరా హిందీలో దేవకట్టా దర్శకత్వంలో ‘ప్రస్థానం’ రీమేక్, ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్‌ హై క్యా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల గురించి ఆమె చెబుతూ– ‘‘ఈ ఏడాది నాకు చాలా లక్కీ. ఇద్దరు సౌత్‌ డైరెక్టర్స్‌తో హిందీ సినిమాలు చేస్తున్నాను. నిజంగా ఇది నాకు గుడ్‌ టైమ్‌. మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement