Raj Taun
-
ఇది నా గుడ్ టైమ్
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయిక అమైరా దస్తూర్ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితం నేను నటించిన ‘అనేగన్’ సినిమా చూసి దర్శకురాలు సంజన ఫోన్ చేశారు. సినిమాలో నటిస్తారా? అని అడిగారు. వాస్తవానికి తెలుగులో నాకు ‘రాజుగాడు’ తొలి చిత్రం కావాల్సింది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఇది నా రెండో సినిమాగా మారింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో హైదరాబాదీ అమ్మాయిలా, సెకండాఫ్‌లో విలేజ్ అమ్మాయిలా నటించాను. రాజ్ తరుణ్ నాకన్నా ఒక ఏడాదే పెద్ద. ఇద్దరి అభిరుచులు బాగా కలిశాయి. షూటింగ్లో ఉన్నా, బయట ఉన్నా రాజ్ ఒకేలా సరదాగా ఉంటాడు. దర్శకురాలు సంజన చాలా స్మార్ట్. ఆమెతో వర్క్ చేస్తే ఒక ఫ్యామిలీతో వర్క్ చేసినట్లు ఉంటుంది. సంజయ్‌లీలా భన్సాలీ నా ఫేవరెట్ డైరెక్టర్. ‘పద్మావత్’ లాంటి íపీరియాడికల్ సినిమాలో నటించాలన్నది నా డ్రీమ్’’ అన్నారు. ప్రస్తుతం అమైరా హిందీలో దేవకట్టా దర్శకత్వంలో ‘ప్రస్థానం’ రీమేక్, ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల గురించి ఆమె చెబుతూ– ‘‘ఈ ఏడాది నాకు చాలా లక్కీ. ఇద్దరు సౌత్ డైరెక్టర్స్‌తో హిందీ సినిమాలు చేస్తున్నాను. నిజంగా ఇది నాకు గుడ్ టైమ్. మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది’’ అన్నారు. -
సినిమా చూపిస్త..!
అందమైన ప్రేమకథతో కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా రూపొందుతోన్న చిత్రం ‘సినిమా చూపిస్త... మావా’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకంపై బోగది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. గోహిల్, జి.సునీత సమష్టిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ -‘‘ ‘ఉయ్యాల జంపాల’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా. మంచి మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా తెరకెక్కించారు’’ అని చెప్పారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేశాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అవికాగోర్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, మాటల రచయిత ప్రసన్న జె.కుమార్ తదితరులు పాల్గొన్నారు.