సినిమా చూపిస్త..! | Cinema Chupista Maava Movie First Look Launched | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్త..!

Published Wed, May 13 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

సినిమా చూపిస్త..!

సినిమా చూపిస్త..!

 అందమైన ప్రేమకథతో  కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా రూపొందుతోన్న  చిత్రం ‘సినిమా చూపిస్త... మావా’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, లక్కీ మీడియా పతాకంపై బోగది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. గోహిల్, జి.సునీత సమష్టిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ -‘‘ ‘ఉయ్యాల జంపాల’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా. మంచి మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా తెరకెక్కించారు’’ అని చెప్పారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేశాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అవికాగోర్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, మాటల రచయిత ప్రసన్న జె.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement